Home latest అభిమానులకు రజనీ స్ట్రాంగ్ వార్నింగ్

అభిమానులకు రజనీ స్ట్రాంగ్ వార్నింగ్

సూపర్ స్టార్ రజనీకాంత్ ఎంట్రీ విషయంలో మరో వార్త తెరమీదకు వచ్చింది. ఇటీవలి కాలంలో రజనీ రాజకీయ అరంగేట్రంపై పలు వార్తలు వచ్చినప్పటికీ రజనీ వాటిని తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ రజనీ ఫ్యాన్స్ తమ హడావుడి కొనసాగిస్తున్నారు. ఇటీవల ఆలిండియా రజినీకాంత్ ఫ్యాన్స్ క్లబ్ నాయకుడు సైదాపేట జి.రవి మీడియాతో మాట్లాడారు. దీనిపై ఆగ్రహించిన తలైవా స్పష్టమైన ప్రకటన చేస్తూ రవిని క్లబ్ నుంచి తొలగించామని తెలిపారు.

తన పొలిటికల్ ఎంట్రీ విషయంలో అభిమానులెవ్వరూ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని ఆలిండియా రజనీకాంత్ ఫ్యాన్స్ క్లబ్ కి తెలియకుండా సొంత ప్రకటనలు చేయడం సరికాదని తాజాగా విడుదల చేసిన ప్రకటనలో రజనీకాంత్ స్పష్టం చేశారు. అంతేకాకుండా రాజకీయాలకు సంబంధించి ఎటువంటి కార్యకలాపాలూ నిర్వహించొద్దని రజనీకాంత్ స్పష్టం చేశారు. జి.రవిని అభిమానుల క్లబ్ నుంచి తొలగించామని అభిమానులు అతనితో ఎలాంటి సంబంధాలు పెట్టుకోకూడదని రజనీకాంత్ స్పష్టం చేశారు.

ఇదిలాఉండగా…రజనీకాంత్ 164వ చిత్రం కాలా ముంబైలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఆదివారం మొదలైన ఈ చిత్ర షూటింగ్ మరో 40 రోజుల వరకు రెగ్యులర్ గా జరగనుందట. రియాలిటి సీన్స్ అన్నింటిని ముంబై వీధుల్లో తెరకెక్కించనున్న రంజిత్ ఆ తర్వాత ముఖ్య మైన సీన్స్ చెన్నైలో వేస్తున్న మురికివాడ సెట్ లో చిత్రీకరించనున్నాడు. తాజాగా రంజాన్ ఫెస్టివల్ సాంగ్ ని చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుండగా రజనీకాంత్ టోపితో కనిపించారు.

Most Popular

FMIM Ad