‘కబాలి’ కూతురు ఫైర్…

0
378
rajanikanth daughter fire media kabali rating

rajanikanth daughter fire media kabali ratingసూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ ‘కబాలి’ సూపర్ బజ్ సృష్టించింది. అయితే.. అంచనాలు అందుకోలేకపోయింది. రికార్డ్‌ లెవల్ వసూళ్లైతే వచ్చాయి గానీ మూవీపై నెగిటివ్ టాక్ వెళ్లాల్సినంత దూరం వెళ్లిపోయింది. అయితే.. 10 రోజుల వరకూ అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయ్ కాబట్టి కలెక్షన్స్ కి ఢోకా లేదని అంటున్నారు. కానీ.. రివ్యూల విషయంలో రజినీ కుమార్తె సౌందర్య రియాక్టవుతున్న తీరుకు చాలామంది విస్తుపోతున్నారు.

థియేటర్ లో మొదటి ఆటపడుతున్నపుడే లైవ్ రివ్యూలు రాయడం ఇప్పుడు సాధారణం. అయితే.. సౌందర్య ‘కబాలి’పై ఇలా రివ్యూలు రాసిన వాళ్లని లైవ్ లోనే ఏకేసింది. నెగిటివ్ అభిప్రాయం వ్యక్తం చేసిన వారిని దులిపేసింది. పైగా ‘తలైవా ఫ్యాన్స్ తరఫున నా అభిప్రాయం చెప్పానంతే’ అని వ్యాఖ్యానించింది. నాన్నగారి మూవీ గురించి ఆశించిన స్పందన రాకపోవడంతోనే సౌందర్య ఇలా విరుచుకుపడిందని అదే సినిమా గురించి ఆహా ఓహా అంటూ రాస్తే మరోలా ఉండేదని కొందరు అంటున్నారు. ఇదిలా ఉంటే.. కబాలిని విమర్శిస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఈ సినిమాను మెచ్చుకున్నవారి ట్వీట్లను రీట్వీట్ చేస్తోందట రజనీ డాటర్.

Leave a Reply