కబాలి కోసం కూతుళ్లే పూనుకుంటున్నారు

  rajanikanth daughters direction  rajanikanth movie

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ ఓ సినిమా తీస్తున్న‌డ‌న్న వార్త బ‌య‌ట‌కు పొక్కితే చాలు… అదే ఓ పండ‌గ‌లా ఫీల‌వుతారు ఆయ‌న అభిమానులు. తాజాగా క‌బాలి చిత్రం ఫ‌లితంతో సంబంధం లేకుండా రికార్డ్స్ సృష్టించి ర‌జ‌నీ స్టామినా ఏంటో మ‌రోసారి చాటి చెప్పింది, క‌బాలీ త‌ర్వాత ర‌జ‌నీ చేస్తున్న చిత్రం  రోబో-2. శంక‌ర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం కూడా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఆ త‌ర్వాత ర‌జ‌నీ మ‌రో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు.

అయితే ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్న‌ది ఎవ‌రో కాదు… ఆయ‌న కుమార్తెలు సౌంద‌ర్య‌, ఐశ్వ‌ర్య‌. ర‌జ‌నీ కోసం స్క్రిప్ట్ ప‌క్కాగా ప్లాన్ చేస్తున్నార‌ట‌. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం ఈ ఏడాది చివ‌రికి ప్రారంభం అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికే సౌంద‌ర్య ద‌ర్శ‌క‌త్వంలో మోష‌న్ పిక్చ‌ర్ కొచ్చాడియాన్ చిత్రంలో ర‌జ‌నీ న‌టించారు.

SHARE