వెండి తెర దేవుడు కూడా ఓ అభిమాని అవుతాడా..?

0
488

 rajanikanth fan pv sindhuదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగానూ కోట్లసంఖ్యలో అభిమాన గణాన్ని సంపాదించుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్. ఈ పవర్‌ఫుల్ నటుడు తాజాగా ఓ అమ్మాయికి ఫ్యాన్ అయిపోయారు. ఆ అమ్మాయి ఎవరో కాదు.. బాడ్మింటన్‌లో తొలిసారి ఒలింపిక్ రజత పతకం సాధించిన మహిళా షట్లర్ సింధు. అసమాన ఆటతో సింధు ఫైనల్‌కు చేరుకుంది. కరోఠ శ్రమతో ఆమె ఈ స్థాయికి చేరుకుంది. అందుకే.. సింధును చూసి దేశం గర్వపడుతోంది.

ఈ జాబితాలో తానూ ఉన్నానంటూ రజనీ ట్వీట్ చేశారు. సింధు నేను నీకు అభిమానిగా మారిపోయా అంటూ ఆమెను ఆశ్వీరదించారు. ఈ యువ షట్లర్‌ను ప్రోత్సహిస్తూ.. రజనీ చేసిన ట్వీట్ అందరినీ ఆకట్టుకుంటోంది. కోట్ల సంఖ్యలో అభిమానుల ఫాలోయింగ్ ఉన్న ఈ సూపర్‌స్టార్ ఓ క్రీడాకారిణికి అభిమానిగా మారిపోవడం ఆసక్తే మరి. 

Leave a Reply