‘రోబో2’ లీకైందా.. ?

Posted October 3, 2016

rajanikanth robo 2 leakedసూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్, డైరెక్ట‌ర్ శంక‌ర్ కలయికలో రోబో సీక్వెల్ గా
తెరకెక్కుతోన్న చిత్రం ‘రోబో 2.0’. అత్యంత భారీ బ‌డ్జెట్ చిత్రంగా
తెర‌కెక్కుతున్న రోబో సీక్వెల్ కి ఊహించని షాక్ తగిలింది. ‘రోబో’ని
మించిన గ్రాఫిక్స్ ని ‘రోబో 2.0’కోసం ప్లాన్ చేశాడు శంకర్. ఇందులో
భాగంగానే.. అదిరిపోయే రేంజ్ లో ‘రోబో 2.0’ లోగోను తయారు చేయించారట. ఈ
సినిమాకి సంబంధించి టీమ్ ఎంతో క‌ష్ట‌పడి లోగోను త‌యారు చేసింద‌ట‌.
త్వ‌ర‌లోనే ఈ లోగోను విడుద‌ల చేయాల‌ని భావించింది శంకర్ టీం. అయితే,
ఇంతలోనే ఊహించని షాక్ తగిలింది. లోగో లీకైంది. ఇప్పుడీ లోగో సోషల్
మీడియాలో లీకైంది. ఈ లోగోపై అభిమానులు చేసిన లోగో అన్న ముద్రపడిపోయింది.
ఇక, శంకర్ టీం మరో అద్భుతమైన లోగోని తయారు చేయించేందుకు మరింత టైం
పట్టేలా ఉంది.

ఇక, ‘రోబో 2.0’లో రజనీ సరసన అమీ  జాక్సన్ జతకట్టనుంది. విలన్ గా బాలీవుడ్
స్టార్ అక్షయ్ కుమార్ కనిపించనున్నాడు. ఈ చిత్రం వచ్చే యేడాది సమ్మర్ లో
ప్రేక్షకుల ముందుకు రానుంది.

SHARE