రజని,ఎన్టీఆర్,రాజమౌళి కాంబోలో సినిమా?

Posted February 12, 2017

rajani,ntr and rajamouli combination movie
ఓ మల్టీస్టారర్ సినిమా తీయాలంటే కథ,కధనాలు కుదరడం ఎంత కష్టం.ఉత్తరాదిన ఈ తరహా సినిమాలు బాగానే వస్తున్నా హీరోల్ని దేవుళ్ళులా ఆరాధించే దక్షిణాదిన ఓ కాంబినేషన్ సెట్ చేయడం అంత తేలిగ్గాదు.కానీ ఓ అద్భుతమైన మల్టీస్టారర్ ఫిలిం దిశగా అడుగులు పడుతున్నాయి. కలలో కూడా సాధ్యం కాదనుకున్న ఓ కాంబినేషన్ కి ఇప్పటికే తొలి అడుగులు పడినట్టు తెలుస్తోంది. మహాభారతంలోని ఓ ఘట్టం ఆధారంగా సినిమా తీయాలని రాజమౌళి ఎప్పటినుంచో అనుకుంటున్నారు.దానికి సంబందించిన కథని విజయేంద్ర ప్రసాద్ రెడీ చేశారంట.ఈ సినిమాలో ఎన్టీఆర్ ఉండటం ఖాయం.మహాభారతం తీస్తే ఎన్టీఆర్ లాంటి నటుడు లేకుండా ఎలా ఉంటాడని అప్పుడెప్పుడో రాజమౌళి అన్న గుర్తు.రాజమౌళి మహాభారతం తీస్తే అందులో ఏ పాత్రకైనా రెడీ అని అమిర్ ఖాన్ ఇంతకుముందే చెప్పారు.అయితే …

విజయేంద్రప్రసాద్ తయారుచేసిన మహాభారత కధలో ఓ పాత్రకి రజనీకాంత్ అయితే బాగా సూట్ అవుతారని రాజమౌళి భావిస్తున్నారట.అందుకే తండ్రిని పంపి రజనికి కథ చెప్పించారట. బాహుబలి టైం లోనే రాజమౌళి మీద ప్రశంసలు కురిపించిన రజని ఆయనతో సినిమాకి ఇంటరెస్ట్ చూపారు.ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ చెప్పిన కథ విన్నాక ఆ సినిమా చేయడానికి రజని ఓకే అన్నారట.భారీ ఎత్తున తీసే మహాభారత కధలో రజని,ఎన్టీఆర్ తో పాటు మరికొందరు టాప్ స్టార్స్ మెరిసే అవకాశముందని సమాచారం.ఏమైనా ఈ కాంబోలో సినిమా షూటింగ్ దాకా రావాలంటే ఇంకో ఏడాది పడుతుంది.టైం ఎంత అయినా ఈ కాంబినేషన్ నిజంగా వాస్తవ రూపం దాల్చితే భారతీయ చలన చిత్ర రంగంలో ఓ అద్భుతానికి,సరికొత్త శకానికి శ్రీకారం చుట్టినట్టే.

SHARE