పారికర్ సీట్లో రాజస్థాన్ సీఎం!!

0
290
rajasthan chief minister vasundhara raje as Union defence minister

Posted [relativedate]

rajasthan chief minister vasundhara raje as Union defence minister
కేంద్ర రక్షణశాఖ మంత్రిగా ఉన్న మనోహర్ పారికర్.. స్వరాష్ట్రానికి వెళ్లిపోవడంతో ఇప్పుడా స్థానంలో ఎవరు రానున్నారన్నది ఆసక్తికరంగా మారింది. రక్షణ మంత్రి పదవి చాలా కీలకమైనది. కాబట్టే పారికర్ ను అప్పట్లో ఏరికోరి ఎంచుకున్నారు ప్రధాని మోడీ. ఆయన వెళ్లిపోవడంతో అంత సమర్థులు ఎవరు అన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. ఆ అవకాశం రాజస్థాన్ సీఎం వసుంధరా రాజెకు రావచ్చన్న ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి.

యూపీ ఎన్నికల్లో బ్రహ్మాండమైన విజయం దక్కడంతో కేంద్ర కేబినెట్ ను మోడీ పునర్ వ్యవస్థీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయానికి ప్రతిఫలంతా యూపీ నుంచి కేంద్రమంత్రి పదవులు పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఆ పునర్ వ్యవస్థీకరణ సమయంలోనే డిఫెన్స్ మినిస్టర్ ను నియమిస్తారట. ఆ పదవి రేసులో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, రాజస్థాన్ సీఎం వసుంధరా రాజె పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నారని మోడీ భావిస్తున్నారట. అందులోనూ ఆర్ఎస్ఎస్ ఆశీస్సులు కూడా ఆయనకు పుష్కలంగా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడిపప్పుడే ఆయన ప్రభుత్వం నిలదొక్కుకుంటోంది కాబట్టి ఫడ్నవిస్ ను మహారాష్ట్ర నుంచి తప్పించే అవకాశాలు లేకపోవచ్చు.

ఇక రాజస్థాన్ సీఎం వసుంధరా రాజె పేరు కూడా డిఫెన్స్ మినిస్ట్రీ రేసులో వినిపిస్తోంది. ఆమె ఆ పదవికి తగిన సమర్థురాలు అని కేంద్ర పెద్దల భావన. అందులోనూ వసుంధరా రాజెను అక్కడ్నుంచి తప్పించాలని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు. అయితే ఆమెను తప్పిస్తే అసమ్మతి తలెత్తవచ్చు. వసుంధరకు ప్రమోషన్ ఇచ్చినట్టు ఉంటుంది.. సీఎం సీటు నుంచి ఆమెను దూరం చేయవచ్చు కాబట్టి ఆమెకు డిఫెన్స్ మినిస్ట్రీ ఆఫర్ చేస్తున్నారట. అందుకు వసుంధర కూడా సానుకూలంగానే ఉన్నారని సమాచారం. రాజస్థాన్ సీఎంగా పార్టీ సీనియర్ నేత ఓమ్ మాథుర్ నియమించే అవకాశముంది.

మొత్తానికి ప్రధాని మోడీ కేబినెట్ లో రక్షణ మంత్రి కావాలంటే.. ముఖ్యమంత్రులకే ఫస్ట్ ప్రియార్టీ ఉంటుందా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఫ్యూచర్ లో ఇదే సెంటిమెంట్ అయిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు గులాబీ క్యాడర్.

Leave a Reply