గ్యారేజ్ లో రాజీవ్ కెరీర్ బాగైందా ?

  rajeev kanakala crucial role changed janata garage movie
రాజీవ్ కనకాల ,ఎన్టీఆర్ కేవలం సహనటీనటులే కాదు .మంచి స్నేహితులు కూడా ..కెరీర్ మొదట్లో ఎన్టీఆర్ సినిమాల్లో రాజీవ్ విలన్ గా ఇరగదీసాడు.వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు భారీ విజయాలు సాధించాయి.కాలక్రమంలో రాజీవ్ వెండితెరపై కాస్త వెనక పడ్డాడు.కానీ నటనలో అతనేమిటో అందరికీ తెలుసు.ఆయన టాలెంట్ మీద ఎవరికీ సందేహాలు లేవు.టాలీవుడ్ లోని మోస్ట్ ప్రామిసింగ్ ఆర్టిస్ట్ ల్లో ఒకరు రాజీవ్.అయితే ఆయన ప్రతిభకి తగ్గ గుర్తింపు,అవకాశాలు రాలేదనే చెప్పాలి.ఓ మంచినటుడు ఇండస్ట్రీ కి దూరమవుతాడా అనే సందేహాలు వచ్చేవి.కానీ వరసగా రెండు సినిమాలు రాజీవ్ ఫేట్ మార్చేశాయి.

కొండంత ప్రతిభ వున్నా రవ్వంత అదృష్టం కలిసిరావాలంటారు.ఆ అదృష్టం ఎన్టీఆర్ సినిమాల రూపంలో మళ్లీ రాజీవ్ తలుపు తట్టింది.నాన్నకి ప్రేమతో సినిమాతో రాజీవ్ ఫామ్ లోకి వచ్చారు.ఇప్పుడు జనతా గ్యారేజ్ తో విశ్వరూపం చూపారు.స్నేహితుడికి వస్తున్న పేరు చూసి ఎన్టీఆర్ ఖుషీ అంట.రాజమౌళి రాజీవ్ ని స్పెషల్ గా అభినందించడం తో పాటు అయన కోసం మంచి క్యారెక్టర్ డిజైన్ చేయబోతున్నాడట.మిగిలిన టాలీవుడ్ అగ్ర నిర్మాతలు,దర్శకుల దృష్టి కూడా రాజీవ్ పై పడేలా చేసింది జనతా గ్యారేజ్.

SHARE