జ‌గ‌దీశ్ రెడ్డి స్థానంలోకి ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి!!

Posted February 3, 2017

rajeswar reddy in jagadeesh reddys place
తెలంగాణ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి స్థానంలోకి ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి వ‌చ్చేశారు. ఇదేంటి జ‌గ‌దీశ్ రెడ్డి మినిస్ట్రీ పోయిందా… అని డౌట్ ప‌డ‌కండి.. ఎందుకంటే జ‌గ‌దీశ్ రెడ్డి స్థాన‌మంటే.. ఆయ‌న మంత్రి ప‌ద‌వి కాదు. మ‌రొకటి ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే డీటైల్స్ లోకి వెళ్లాల్సిందే.

జ‌గ‌దీశ్ రెడ్డి…. కేసీఆర్ కు అత్యంత స‌న్నిహితుల్లో ఒక‌రు. ఉద్య‌మ స‌మ‌యం నుంచి కేసీఆర్ కు వెన్నంటి ఉన్నారాయ‌న‌. కీల‌క విష‌యాల‌న్నీ ఆయ‌న‌తోనే చ‌ర్చించేవార‌ట కేసీఆర్. ఉద్య‌మ సంద‌ర్భంగా చాలా నిర్ణ‌యాల్లో జ‌గ‌దీశ్ పాత్ర ఉంద‌ని పార్టీ నాయ‌కులు చెబుతుంటారు. కొంద‌రైతే ఆయ‌న‌ను కేసీఆర్ అన‌ధికార‌ స‌ల‌హాదారుగా కూడా భావిస్తారు. అందుకే త‌న కేబినెట్ లోకి జ‌గ‌దీశ్ ను తీసుకొని… త‌గిన న్యాయం చేశారట‌ కేసీఆర్. మినిస్ట్రీ అయితే ఇచ్చారు…కానీ సీఎం కేసీఆర్ ఇప్పుడు జ‌గ‌దీశ్ ను సంప్ర‌దించ‌డం మానేశార‌ట. మానేస్తే మానేశారు.. కానీ ఆస్థానంలో ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి వ‌చ్చేశార‌ట‌. ఇప్పుడు కేసీఆర్ ద‌గ్గ‌ర రాజేశ్వ‌ర్ రెడ్డి హ‌వానే న‌డుస్తోంద‌ట‌. ముఖ్య‌మంత్రి ఇప్పుడు ప్ర‌తి విష‌యంలోనూ ఈయ‌న స‌ల‌హా తీసుకుంటున్నార‌ని టాక్. అధికారిక నిర్ణయాల్లోనూ రాజేశ్వ‌ర్ రెడ్డి పాత్ర ఉంటోంద‌ట‌.

ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డికి కేసీఆర్ ద‌గ్గ‌రే కాదు టీఆర్ఎస్ పార్టీలోనూ ప్రాధాన్యం రోజురోజుకు పెరుగుతోంద‌ట‌. అంతేకాదు ప్ర‌స్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ప‌ల్లాకు త్వ‌ర‌లో ప్ర‌మోష‌న్ కూడా ఇస్తార‌ని టాక్. ఆయ‌నను పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్ర‌క‌టించే అవ‌కాశాలున్నాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. టీఆర్ఎస్ లోకి లేటుగా వ‌చ్చిన నాయ‌కుల్లో కేసీఆర్ ద‌గ్గ‌ర ఇన్ని మార్కులు కొట్టేసిన నాయ‌కుడు… ఒక్క ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డేన‌ని పార్టీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఎంతైనా అదృష్ట‌మంటే రాజేశ్వ‌ర్ రెడ్డిదే!!!

SHARE