రజని ఫాన్స్ కి మళ్లీ నిరాశ.

Posted September 27, 2016

 rajini brother sathyanarayana said rajinikanth not coming politics
సూపర్ స్టార్ రజని కాంత్ అభిమానులకి మరోసారి నిరాశ ఎదురైంది.ఈసారి సినిమా వ్యవహారంలో కాదు..రాజకీయాలకి సంబంధించి.అయన ఫాన్స్ హర్ట్ అయ్యే ప్రకటన బయటకొచ్చింది.ఆ ప్రకటన చేసింది మరెవరో కాదు..స్వయానా రజని సోదరుడు సత్యనారాయణ .ఇంతకీ అయన ఏమి చెప్పాడంటే రజని ఎప్పటికీ రాజకీయాల్లోకి రాకూడదని నిర్ణయించుకున్నట్టు వివరించారు.రజని ని తమ పార్టీలోకి లాగడానికి ఇటు బీజేపీ ..అటు కాంగ్రెస్ విశ్వ ప్రయత్నం చేస్తున్న వేళ అయన ఫాన్స్ కూడా ఏదో జరుగుతుందని ఆశించారు.కానీ తాజా ప్రకటన వారిలో ఉత్సాహాన్ని దెబ్బకొట్టింది.

తమిళనాట ఈ సీన్ ఇప్పటికి ఎన్నోసార్లు రిపీట్ అయింది.అయినా రజని ఫాన్స్ ఈసారైనా తమ అభిమాన హీరో మనసు మారకపోతుందా అని ఎప్పటికప్పుడు ఆశగా ఎదురు చూస్తున్నారు.ఇప్పుడు జయ ఆరోగ్యం గురించి పుకార్లు రావడంతో అన్నాడీఎంకే వర్గాలు సైతం రజనీకాంత్ కి ఆహ్వానం పలికినట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజానిజాలెలా వున్నా రజని సోదరుడి ప్రకటన ఫాన్స్ తో పాటు వివిధ రాజకీయ పార్టీల ఆశలపై కూడా నీళ్లు చల్లింది.

SHARE