రజని కుమార్తె ఒప్పుకుంది ..

0
421

  rajini daughter soundarya said about divorce twitter
రజని కుమార్తె సౌందర్య వైవాహిక జీవితం బాగా లేదన్న వార్తలపై ఆమే స్వయంగా స్పందించారు.ప్రచార మాధ్యమాల్లో వస్తున్న వార్తలు నిజమేనని ట్విట్టర్ ద్వారా సౌందర్య తెలిపారు.ఏడాదిగా తాము విడివిడిగా ఉంటున్నట్టు ఆమె వివరించారు.విడాకుల గురించి చర్చలు నడుస్తున్నాయని కూడా సౌందర్య వెల్లడించారు .ఈ కష్ట కాలంలో అండగా వుంటున్నందుకు సోదరి భర్త ధనుష్ కి ఆమె కృతజ్ఞతలు చెప్పారు.అయితే ఇది తమ కుటుంబ వ్యవహారమని ..దయ చేసి దాన్ని పెద్దది చేయొద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.

గ్రాఫిక్స్ రంగంలో నైపుణ్యమున్న సౌందర్య 2010 లో వ్యాపారవేత్త అశ్విన్ రామ్ కుమార్ ని పెళ్లిచేసుకున్నారు.2015 లోసంతానం కలిగాక వారి మధ్య విభేదాలు ఎక్కువయ్యాయి.రజని సహా కుటుంబం అంతా వారిని కలిపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.తండ్రితో కొచ్చాడియాన్ అనే యానిమేషన్ చిత్రం తీశారు. అది ప్లాప్ కావడంతో కొన్నాళ్లుగా మౌనం దాల్చిన ఆమె ఇప్పుడు బావ ధనుష్ తో ఓ సినిమా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

News about my marriage is true. We have been separated for over a year & divorce talks are on. I request all to respect my family’s privacy.

Leave a Reply