Posted [relativedate]
సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవలే అనారోగ్యం నుండి కోలుకొన్నారు. ‘కబాలి’ షూటింగ్ పూర్తికాగానే చికిత్స కోసం అమెరికా వెళ్లారు రజనీ. దాదాపు 3నెలల పాటు అక్కడ చికిత్స తీసుకొన్నాడు. కబాలి రిలీజ్ తర్వాత మళ్లీ ఇండియా తిరిగొచ్చారు. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకొన్న తర్వాత మళ్లీ ‘రోబో 2’ షూటింగ్ లో పాల్గొన్నారు. ఇప్పటికే రోబో2 షూటింగ్ దాదాపు 70శాతం పూర్తయ్యింది.
అయితే, తాజాగా రజనీ మరోసారి చికిత్స కోసం అమెరికా వెళ్లినట్టు సమాచారమ్. గతంలో చేయించుకొన్న చికిత్స కొనసాంగిపు ట్రీట్ మెంట్ కోసం యూఎస్ వెళ్లారా.. ? లేదా ఏదైనా కొత్త ఆరోగ్య సమస్యలు వచ్చిపడ్డాయా.. ?? అని సూపర్ స్టార్స్ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. రజనీకి తోడుగా కూతుళ్లు, అల్లుడు ధనుష్ కూడా ఉన్నారట. ఏదేమైనా రజనీకి అంతా మంచే జరగాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఇదిలావుండగా.. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రజీనీ రోబో 2 వచ్చే యేడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈలోపు నవంబర్ నెలలో రోబో 2 ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయనున్నారు. డిసెంబర్ లేదా జనవరిలో ఆడియోని తీసుకురానున్నారు. ఈ చిత్రం రజనీ సరసన అమీ జాక్సన్ జతకట్టనుంది. విలన్ గా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్నారు.