కరుణతో తలైవా మంతనాలు!!

Posted December 11, 2016

rajini met karunanidhi
డీఎంకే చీఫ్ కరుణానిధితో సూపర్ స్టార్ రజినీకాంత్ భేటీ అయ్యారు. జయలలిత మరణం నేపథ్యంలో తలైవా.. కరుణను కలుసుకోవడం చర్చనీయాంశంగా మారింది. డీఎంకే చీఫ్ అనారోగ్యం నేపథ్యంలోనే రజినీ ఆయనను కలుసుకున్నారని చెబుతున్నారు. పరామర్శించడానికే ఆయన వెళ్లారని డీఎంకే వర్గాలు చెబుతున్నాయి. దాదాపు గంట సేపు ఈ భేటీ కొనసాగిందని తెలుస్తోంది.

తలైవా.. కరుణానిధిని కలవడం వెనక వేరే కారణాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాలపైనే వీరిద్దరి మధ్య చర్చ జరిగి ఉంటుందన్న అనుమానాలున్నాయి. జయ మరణం.. ఆ తర్వాత మారిన పరిస్థితులు చర్చకు వచ్చాయట. ముఖ్యంగా శశికళ టాపిక్ కూడా వచ్చిందని టాక్. ప్రస్తుతం అన్నాడీఎంకేకు దిశానిర్దేశం చేసే వారు కరువవ్వడంతో రాజకీయం ఎలా ఉంటుందని రజినీ… కరుణను ప్రశ్నించారట. దానికి ఆయన కొన్ని రోజులు గడిస్తే కానీ క్లారిటీ రాదని చెప్పారట. ఈ భేటీతో తమిళ రాజకీయాలు ఒక్కసారిగా ఛేంజ్ కాకపోవచ్చు. కానీ కరుణ- తలైవా భేటీ మాత్రం కొత్త చర్చకు ఆస్కారమిచ్చింది. కొంపదీసి ఇద్దరు కలుస్తారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే ప్రతిపక్షంలో ఉన్న డీఎంకేలో రజినీ ఉండగలుగుతారా? అన్నది అనుమానమే.

అన్నాడీఎంకే శ్రేణులు మాత్రం ఈ మీటింగ్ వెనక అసలు మర్మం వేరే ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా శశికళ- పన్నీర్ సెల్వం బలహీన ప్రత్యర్థులు కావడంతో.. వారిని దెబ్బకొట్టేందుకే ఈ మంతనాలు జరిగి ఉంటాయన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

SHARE