రజని తో ఛాన్స్ ఎవరికి?

 rajini next film director ranjith and gautham menon
సూపర్ స్టార్ రజని కాంత్ తరువాతి సినిమా ప్రొడ్యూసర్ ఎవరో తేలిపోయింది .అయన మరెవరో కాదు రజని అల్లుడు ధనుష్.అయితే ఈ సినిమాకి పనిచేసే డైరెక్టర్ ఎవరన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు.మొదట కబాలి డైరెక్టర్ రంజిత్ చెప్పిన కధకి రజని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలొచ్చాయి .రంజిత్ స్వయంగా ఈ విషయంపై స్పందించాడు .కబాలి ఫలితంతో సంబంధం లేకుండా మరో అవకాశం వచ్చినట్టే మాట్లాడాడు .ఇంతలో మరో పేరు ముందుకొచ్చింది .

రజని సినిమా విషయంలో రెండోసారి వచ్చిన పేరు ఆషామాషీదేమి కాదు .స్టార్స్ తో ,స్టార్స్ లేకుండా కూడా భారీ హిట్ లు కొట్టి దక్షిణాదిలో తనదైన బ్రాండ్ వేసుకొన్న గౌతమ్ మీనన్ .ఈయన చెప్పిన ఓ కదా ధనుష్ కి తెగ నచ్చిందట .ఆ కధ రజనికి అయితే బాగుంటుందని భావించి రజని కి చెప్పారంట .ఈ ఇద్దరిలో రజని ఎవరికి ఓటేస్తారో?

SHARE