నాన్నా పులి…రాజకీయాల్లోకి రజని

Posted [relativedate]

rajini political entry in suspense
ఈ తరం ఇంగ్లీష్ మీడియం చదువులు చదివిన వాళ్లకి తెలుసో లేదో కానీ అప్పట్లో తెలుగు మీడియం చదువులు చదివిన అందరికీ నాన్నా పులి కధ తెలుసు.తెలియని వాళ్ళ కోసం క్లుప్తంగా ఆ కధ ..

ఓ తండ్రీకొడుకు ఆవుల్ని మేపుకోడానికి అడవికెళ్లారు.కొంతసేపటికి అలసిపోయిన తండ్రి ఓ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ…ఏ అవసరం వచ్చినా తనని పిలవమని చెప్పాడు.కాసేపటికి ఆ కొడుకు నాన్నా పులి అని అరిచాడు.ఆవుల మంద మీదకి పులి వచ్చిందేమో అనుకుంటూ ఆ తండ్రి ఆదుర్దాగా అక్కడికి వెళ్ళాడు.అక్కడ పులి లేదు.గిలి లేదు.తండ్రిని ఆట పట్టించి నవ్వుకుంటున్న కొడుకు పళ్ళు ఇకిలిస్తూ కనిపించాడు.దీంతో తండ్రి అతనికి జాగ్రత్త మళ్లీ చెట్టు కిందకి వెళ్ళాడు.నాన్నా పులి అని మరోసారి అరుపు.అక్కడికి వెళ్లిన తండ్రికి అదే సీన్ కనిపించింది.ఈసారి కొడుకు గొంతు వినిపించినా తండ్రి వెళ్ళలేదు.నిజంగానే పులి వచ్చింది.ఆవుతో పాటు ఆ పిల్లవాడిని ఎత్తుకెళ్లింది.

పై కధలో సీరియస్ విషయాన్ని కామెడీ చేసి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు కొడుకు.రాజకీయం విషయంలో రజని కూడా అదే చేస్తున్నాడు.ఆయన రాక కోసం వేచి చూసే వాళ్లందరినీ పదేపదే పిచ్చివాళ్ళని చేస్తున్నాడు.ఫాన్స్ లో ఆ ఉత్సాహం పోయినా ఆయన ముందుకొచ్చినా వెనుక నడిచే వాళ్ళు ఉండకపోవచ్చు.ఆధ్యాత్మిక విషయాలు కూడా తెలిసిన రజనికి మనకు దక్కుతున్న గౌరవం అది ఇస్తున్నవాడి గొప్పదనమని వేరే చెప్పాలా ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here