Posted [relativedate]
జనతా గ్యారేజ్ విజయాన్ని ఆస్వాదిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఓ స్వీట్ షాకింగ్ అనుభవం ఎదురైంది.తలైవా రజని ఆయనకి ఫోన్ చేశారంట.’జనతా గ్యారేజ్ చూసాను ..నువ్వు నటించలేదు ..జీవించావు’…అని రజని చెప్పడంతో ఎన్టీఆర్ ఆనందానికి అవధుల్లేవంట.ఇంత బిజీ గా ఉండి కూడా సినిమా చూసి ఫోన్ చేసి అభినందించినందుకు రజనీకాంత్ కి ఎన్టీఆర్ కృతజ్ఞతలు చెప్పారంట.
జనతా గ్యారేజ్ చూసిన రజని అంతటితో సరిపెట్టలేదు..మోహన్ లాల్ కి కూడా ఫోన్ చేశారు.ఈ ఫోన్ కబురుతో ఒక్క ఎన్టీఆర్ మాత్రమే కాదు..అయన ఫాన్స్ కూడా ఖుషీ అయిపోతున్నారు.