స్పీడ్ పెంచిన రజిని

Posted November 6, 2016

rj1616కబాలి తర్వాత కాస్త రిలాక్సెడ్ గా ఉన్న సూపర్ స్టార్ రజినికాంత్ ఇప్పుడు రోబో 2.0 షూటింగ్లో పాల్గొన్నారు. ఈ మధ్య అనారోగ్య సమస్యతో మరోసారి అమెరికా వెళ్లొచ్చిన రజిని రోబో షూట్ లో జాయిన్ అయ్యాడట. ఇక ఈ షెడ్యూల్ చాలా రోజులు ప్లాన్ చేశాడట. అనుకున్న టైం కల్లా సినిమా రిలీజ్ చేయాలంటే ఇక స్పీడ్ పెంచక తప్పదని గమనించిన రజిని రోబో 2.0 కోసం తన పూర్తి సమయం కేటాయిస్తున్నారు.

శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్నారు. ఎమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో రజిని మూడు పాత్రల్లో కనిపించనున్నారట. దాదాపు 350 కోట్ల బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా హాలీవుడ్ సినిమాకు ఏమాత్రం తీసి పోకుండా ఉంటుందని అంటున్నారు. 2017 సమ్మర్ టార్గెట్ తో వస్తున్న ఈ రోబో 2.0 ఎలాంటి సంచలనాలను సృష్టిస్తాడో చూడాలి.

SHARE