కమల్ కు రజని శుభాకాంక్షలు..

   rajinikanth appreciate kamal hassanప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ను ఫ్రాన్స్‌ అత్యున్నత పౌరపురస్కారం ‘షెవలియర్‌’ అవార్డు వరించిన సంగతి తెలిసిందే. సినిమా రంగానికి ఆయన చేసిన సేవలకు గానూ ఫ్రాన్స్‌ ప్రభుత్వం ఈ పురస్కారాన్ని అందజేస్తోంది. ఈ సందర్భంగా సూపర్‌స్టార్‌ రజనీ కాంత్‌.. కమల్‌ కు ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ‘మా తరం నటీనటులకు షెవలియర్‌(వీరుడు) అయిన నా మిత్రుడు కమల్‌ హాసన్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్‌ చేశారు. ఈ సందేశంపై కమల్‌తో పాటూ ఆయన అభిమానులు ఆనందం వ్యక్తంచేశారు.

SHARE