అప్పుడు మద్ధతిచ్చిన రజిని ఇప్పుడేమంటాడో..!

Posted [relativedate]

Rajinikanth Family Shock For Note Ban Effectనవంబర్ 8న మిడ్ నైట్ నుండి 500, 1000 నోట్లు బ్యాన్ అనగానే అందరు షాక్ అయ్యారు. సెలబ్రిటీస్ అయితే వారెవా మోదిజి అన్నట్టు తమ అభిప్రాయాలను ట్వీట్స్ రూపంలో అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఇక వారిలో సూపర్ స్టార్ రజినికాంత్ కూడా ఉన్నరనుకోండి. అయితే ఇప్పుడు ఆ నోట్ల రద్దు వల్లనే తన భార్య లత నడుపుతున్న ఆశ్రమ పాఠశాల స్కూల్ డ్రైవర్స్ కు జీతం ఇవ్వలేకపోయారట.

నోట్ల రద్దే భారీ దెబ్బ అనుకుంటుంటే ఆ తర్వాత జయలలిత మరణం ఆ వెంటనే వార్ధా తుఫాన్ ఇలా తమిళనాడుని ముఖ్యంగా చెన్నైను కష్టాల్లో పడేసాయి. ఈ కారణాల వల్ల స్కూల్ వ్యాన్ డ్రైవర్స్ కు ఇవ్వాల్సిన జీతం చెల్లించలేదట. దీనికోసం డ్రైవర్స్ ధర్నాకు కూడా దిగారట. పరిస్థితి మేనేజ్మెంట్ నుండి లత రజినికాంత్ దగ్గరకు చేరేసరికి వారు కూడా షాక్ తిన్నారు. ఇన్నాళ్లు నోట్ల రద్దు ఎఫెక్ట్ పడలేదు కాబట్టి మోదికి జై కొట్టారు మరి వారితో పాటుగా అప్పుడు మద్ధతిచ్చిన రజిని ఇప్పుడేమంటాడో చూడాలి.

Leave a Reply