మోడీ అంటే తలైవాకు కోపముందా..?

0
710
rajinikanth fires on modi that's why he will coming to politics

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

rajinikanth fires on modi that's why he will coming to politicsపిల్లినైనా గదిలో పెట్టి అదే పనిగా కొడితే.. తిరగబడి పులౌతుందని మన పెద్దోళ్లు ఎప్పుడో చెప్పారు. ఇప్పుడు తమిళనాడులో పరిస్థితి చూస్తే ఆ సామెత నిజమే అనిపిస్తుంది. రజనీకాంత్ లాంటి పెద్దమనిషికి కోపం రావడానికి ప్రధానే పుణ్యం కట్టుకున్నారనే మాట వినిపిస్తోంది. జయ మరణం, కరుణ అనారోగ్యంతో తమిళనాడులో పరిస్థితిని అడ్వాంటేజ్ గా తీసుకున్న కేంద్రం.. ఓవరాక్షన్ చేసిందని, అందుకే తలైవాకు కోపం వచ్చిందనే వాదన బయల్దేరింది.

ఏకంగా తమిళనాడు సీఎం ఆఫీస్ పక్కనే ఉన్న సీఎస్ ఆఫీస్ పై దాడులు చేయించడం, రాష్ట్ర పోలీసులకు కనీస సమాచారం ఇవ్వకపోవడం తమిళులు తమ ఆత్మగౌరవానికి దెబ్బ తగిలినట్లుగా భావించారు. తమ తమిళ నేతలు లేని సమయంలో మోడీ తమ రాష్ట్ర గౌరవాన్నే దెబ్బతీశారని వారు లోలోపల మండిపడుతున్నారు. ఇలాంటి సమయంలోనే సూపర్ స్టార్ అభిమానులు కూడా తమ భావాలు రజినీకి చేరవేశారు. పైగా మొన్నటికి మొన్న తలైవాను కలిసిన చిదంబరం ఇంటిపైనా సీబీఐ రైడ్స్ జరగడంతో.. తలైవాకు అరికాలి మంట నెత్తికెక్కిందట.

మోడీపై కోపంతోనే రజనీకాంత్ రాజకీయాలు మాట్లాడుతున్నారని, అందుకే హఠాత్తుగా అభిమానులతో సమావేశాల పేరుతో హడావిడి చేస్తున్నారని చెన్నైలో చెప్పుకుంటున్నారు. అదే నిజమైతే.. మోడీ వ్యూహం ఎదురుతిరిగినట్లే. ఇప్పటికే స్టాలిన్ కు మద్దతు ప్రకటిస్తున్నట్లుగా మాట్లాడుతున్న రజనీకాంత్.. ఎన్నికల నాటికి తమిళ్, నాన్ తమిళ్ సెంటిమెంట్ రగిలిస్తారని అంచనా వేస్తున్నారు. యుద్ధానికి సిద్ధంగా ఉండమన్న వ్యాఖ్యలతో తలైవా మోడీకి హెచ్చరికలు పంపినట్లేనన్న విశ్లేషణలు జోరందుకున్నాయి.

Leave a Reply