Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రజని రాజకీయాల్లోకి రాకూడదని కొన్ని తమిళ సంఘాలు చేసిన ఆందోళనకి ఆయన ఫాన్స్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది.రజని నాన్ లోకల్ కాబట్టి,తమిళుడు కాదు కాబట్టి రాజకీయాల్లోకి ఠాకూడదని కొన్ని సంఘాలు వాదిస్తున్న విషయం తెలిసిందే.అయితే రజని రాజకీయ ప్రవేశానికి సిద్ధమన్న సంకేతాలు పంపాక సదరు సంస్థలు దూకుడుగా ప్రదర్శనలు,ఆందోళనలు చేశాయి.రజని ఇంటిని చుట్టుముట్టే ప్రయత్నం చేశాయి.పోలీసులు ఆ చర్యల్ని అడ్డుకున్నప్పటికీ దీంతో రజనికి సానుకూలత లేదన్న సంకేతాలు వెళ్లాయి.పైగా వివాదాలకు దూరంగా వుండే రజని ఇలాంటి చర్యలతో వెనకడుగు వేస్తారని కూడా కొందరు అంచనా వేశారు.అయితే ఆ అంచనాల్ని తల్లకిందులు చేస్తూ రజని కౌంటర్ ఇచ్చాడు.
రజని మనోభావాలకు తగ్గట్టు ఆయన ఫాన్స్ కూడా రెచ్చిపోయారు.చెన్నై వీధుల్లో కదం తొక్కుతూ రజని రాజకీయాల్లోకి రావాల్సిందేనని డిమాండ్ చేశారు.రాజకీయ కుట్రతోనే కొందరు రజని రాకని అడ్డుకుంటున్నారని ఆరోపించారు.ఈ కుట్రల్ని బద్దలు కొట్టి తమిళనాట రజని రాజ్యం తీసుకొస్తామని నినాదాలు చేశారు.మొత్తానికి ఈ ఆందోళనతో రజని డిఫెన్స్ మాత్రమే కాకుండా అవసరం అయితే ఆఫెన్స్ కూడా ఆడగలరని సంకేతం ఇచ్చినట్టు అయ్యింది.