సినిమాల‌కు త‌లైవా గుడ్ బై?

0
470
rajinikanth goodbye to movies

Posted [relativedate]

rajinikanth goodbye to movies
సూప‌ర్ స్టార్ రజినీకాంత్ సినిమాల‌కు గుడ్ బై చెప్ప‌నున్నారా? రోబో 2.0 నే ఆయ‌న చివ‌రి సినిమానా? ఇక ప్యూచ‌ర్ అంతా ఆయ‌న దైవ‌చింత‌న‌లోనే గ‌డ‌ప‌నున్నారా? అంటే ఔన‌నే అనిపిస్తోంది. ఎందుకంటే ఎప్పుడూ పెద్ద‌గా మాట్లాడ‌ని ర‌జినీ ఈ మ‌ధ్య కొన్ని విష‌యాలపై కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు మాట్లాడారు.

ఇటీవ‌ల చెన్నైలో ప‌ర‌మ‌హంస యోగానంద ర‌చించిన ‘దైవీగ కాదల్‌’ పుస్త‌కావిష్క‌ర‌ణ‌లో త‌లైవా పాల్గొన్నారు. ఆస్తులు, హోదా కంటే ఆధ్యాత్మికతను స్వీకరించడానికే తాను ఇష్టపడతానని తెలిపారు. ఆధ్యాత్మికంలోనే ఎక్కువ ‘శక్తి’ ఉందని చెప్పుకొచ్చారు. సినిమాల టాపిక్ వ‌చ్చేస‌రికి… న‌ర‌సింహ చిత్రం ద్వారా న‌టన‌కు ఫుల్ స్టాప్ పెట్టాల‌ని ర‌జినీ అప్ప‌ట్లో అనుకున్నార‌ట‌. కానీ బాబా విశేషాల‌ను అంద‌రికీ చెప్పాల‌న్న ఉద్దేశ్యంతో బాబా సినిమాల‌తో న‌టించార‌ట‌. అంతేకాదు ఆ సినిమా ఆడ‌క‌పోయినా… అయినా నిరాశ చెంద‌లేద‌ట‌. బాబా భారీ న‌ష్టాలు తేవ‌డంతో… తానే డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు డ‌బ్బిచ్చి ఆదుకున్నారు. ఆ త‌ర్వాత ఆయ‌న మెల్ల‌గా సినిమాల్లో బిజీ అయిపోయారు.

అయితే ర‌జినీ చేసిన కామెంట్స్ పై జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది. ఆధ్యాత్మిక‌త‌, సినిమాలపై ఆయ‌న ఇంత సీరియ‌స్ గా ఎప్పుడూ మాట్లాడ‌లేద‌ట‌. అందుకే ఆయ‌న‌ ఇక సినిమాల్లో న‌టించ‌రేమోన‌న్న వాద‌న వినిపిస్తోంది. బాబా నాటి విష‌యాల‌ను ప్ర‌స్తావించడం కూడా అందుకేన‌న్న ఊహాగానాలు వ‌స్తున్నాయి. సినిమాల‌కు గుడ్ బై చెప్పి ఆయ‌న దైవ చింత‌న‌లో వెళ్లిపోతారేమోనన్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఒక‌వేళ ఈ ఊహాగానాలు నిజ‌మైతే సూప‌ర్ స్టార్ అభిమానుల‌కు ఇది చేదువార్తే!!! ఇది నిజం కాకూడ‌ద‌ని కోరుకునే వాళ్లే ఎక్కువ అని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేదు!!!

Leave a Reply