కబాలి సీక్వెల్‌ టైటిల్‌ అదిరింది

0
506
Rajinikanth next sequel title super

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Rajinikanth next sequel title super
సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ హీరోగా రంజిత్‌ పా దర్శకత్వంలో తెరకెక్కబోతున్న మరో సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇటీవలే విడుదలైన విషయం తెల్సిందే. ధనుష్‌ భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్న ఈ సినిమాలో రజినీకాంత్‌ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నాడు. ‘కబాలి’కి సీక్వెల్‌లా ఉంటుంది కాని, పూర్తిగా సీక్వెల్‌ కాదని, ఆ సినిమా కథకు ఈ కథకు పూర్తి విరుద్దంగా ఉంటుందని దర్శకుడు చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాకు ‘కాలా’ అంటూ టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ఇదే టైటిల్‌తో అన్ని భాషల్లో కూడా విడుదల చేసేందుకు ప్లాన్‌ చేశారు.

ఒకేసారి తమిళంతో పాటు హిందీ మరియు తెలుగులో కూడా ఈ సినిమా టైటిల్‌ను రిజిస్ట్రర్‌ చేయించినట్లుగా తెలుస్తోంది. నేడు ‘కాలా’ టైటిల్‌ లోగోను చిత్ర యూనిట్‌ సభ్యులు ఆవిష్కరించారు. ముంబయి మాఫియా నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్న నేపథ్యంలో ఇటీవలే రజినీకాంత్‌ మరియు దర్శకుడు రంజిత్‌ పాకు బెదిరింపులు ఎదురయ్యాయి. ముంబయి మాఫియా అంటూ తమ వారిని రౌడీలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదు అంటూ ఒక మాఫియా డాన్‌ స్వయంగా రజినీకాంత్‌ను హెచ్చరించడం జరిగింది. అయినా కూడా ఏమాత్రం జంకు లేకుండా రజినీకాంత్‌ అండ్‌ టీం ‘కాలా’కు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే సంవత్సరంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ సంవత్సరంలో రజినీకాంత్‌ మరో సినిమా ‘2.0’ చిత్రం విడుదల కానుంది.

Leave a Reply