Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తమిళనాట విమర్శలు,పొగడ్తల్ని పెద్దగా పట్టించుకోకుండా సూపర్ స్టార్ రజని కాంత్ రాజకీయ పార్టీ ఏర్పాటు పనుల్ని ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది.ఇప్పటికే ఓ సీనియర్ జర్నలిస్ట్ పార్టీ వ్యవహారాలు,విధానాల రూపకల్పనలో రజనికి సహకరిస్తున్నారట.ఆయనతో పాటు రజని అల్లుడు ధనుష్,కుమార్తెలు ఇద్దరు కూడా పార్టీ కి అవసరమైన వ్యవహారాల్లో సంప్రదింపులు చేస్తున్నట్టు సమాచారం.అంతా అనుకున్నట్టు జరిగితే ఆగష్టు 15 న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రజని కొత్త పార్టీ గురించి అధికారిక ప్రకటన చేయబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం.
ఇక రజని పార్టీ కి సంబందించిన జెండా డిజైన్లు కూడా కొన్నిటిని అనుకున్నారట.వాటిలో ఒకటి ఫైనలైజ్ అయినట్టే కానీ కొందరు మేధావుల సలహా సంప్రదింపుల తర్వాత మాత్రమే దానిపై తుది నిర్ణయం తీసుకుంటారు.ఆగష్టు 15 న చెన్నైలో భారీ బహిరంగసభ నిర్వహించి పార్టీ ప్రకటన చేయడమా లేక నిరాడంబరంబరంగా ప్రకటన చేయడమా అన్నది ఇంకా తేలలేదు.ఇక రాజకీయంగా రజనితో నడవాలనుకునే వాళ్ళు ఆయనతో భేటీ అవుతున్నారు.తమిళ్ ఇండస్ట్రీ కి చెందిన కొందరు హీరో,హీరోయిన్లు కూడా రజని పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం.