Posted [relativedate]
రోబో సీక్వెల్ ‘రోబో 2.0’ చిత్రీకరణ క్లైమాక్స్ కి చేరుకొంది. పాటలతో పాటుగా, కొన్ని సీన్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇటీవలే రోబో సీక్వెల్ క్లైమాక్స్ సన్నివేశాలని చిత్రీకరించారు దర్శకుడు శంకర్. దీంతో.. మేజర్ పార్ట్ పూర్తయ్యింది.
ముందుగా రోబో2ని దీపావఌ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొద్దామని ప్లాన్ చేశారు. అయితే, ఆ మధ్య రజనీ అనారోగ్యానికి గురికావడం.. అమెరికా వెళ్లి
చికిత్స పొందడంతో రోబో 2 చిత్రీకరణ ఆలస్యమైంది. రజనీ తిరిగిరాగానే జెడ్ స్వీడుతో చిత్రీకరణని కొనసాగించాడు. క్లైమాక్స్ లో ఎర్రకోట, పార్లమెంట్..
కనిపించనున్నాయి. వీటికోసం ప్రత్యేకంగా సెట్స్ వేసి షూటింగ్ కానిచ్చారు. వీటికి గ్రాఫిక్స్ మాయజాలం అద్దడంతో క్లైమాక్స్ చాలా బాగా రానుందట. ఇక,
డిసెంబర్ లో మిగిలిన పార్ట్ ని కూడా పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత దాదాపు ఆరునెలల పాటు గ్రాఫిక్స్ పై కూర్చోనున్నారు.
ఈ చిత్ర్రంలో రోబో2.0లో రజనీ సరసన అమీ జాక్సన్ జతకట్టనుంది. విలన్ గా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కనిపించబోతున్నాడు. ఈ చిత్రం వచ్చే యేడాది
సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
రజనీకాంత్ హీరోగా గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విజువల్ వండర్ 2.0. ఇదే కాంబినేషన్ లో రూపొందిన రోబో సినిమాకు సీక్వల్ గా
రూపొందుతున్న ఈ సినిమాను మరింత భారీగా తెరకెక్కిస్తున్నారు. ఐ సినిమా ఫెయిల్యూర్ తో డీలా పడ్డ శంకర్, 2.0తో మరోసారి తన స్టామినా ప్రూవ్
చూసుకోవాలని భావిస్తున్నాడు.
రజనీ అనారోగ్యం కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడినా.. ప్రస్తుతం శంకర్ ప్లానింగ్ తో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే క్లైమాక్స్ పార్ట్
షూటింగ్ అయిపోవటంతో దాదాపు సినిమా షూటింగ్ పూర్తయినట్టే అని భావిస్తున్నారు. పాటలతో పాటు కొన్ని సీన్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి.
బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమా క్లైమాక్స్ కోసం భారీ సెట్స్ రూపొందించారు.
పతాక సన్నివేశాల్లో ఎర్రకోట, పార్లమెంట్ పరిసరాల్లో భారీ యాక్షన్ సీన్స్ ఉండటంతో ఆ రెండింటినీ చెన్నైలో సెట్ వేసినట్టుగా సమాచారం. భారీ గ్రాఫిక్స్ అవసరం ఉండటంతో వీలైనంత త్వరగా మిగతా షూటింగ్ పూర్తి చేసి విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ మొదలు పెట్టాలని భావిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేసి 2017 చివర కల్లా ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.