తమిళ సంత్సరాది కానుకగా రోబో 2.0 టీజర్

0
653
rajinikanth robo 2 movie teaser release date details

Posted [relativedate]

rajinikanth robo 2 movie teaser release date detailsరజనీకాంత్, ఐశ్వర్య రాయ్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన రోబో చిత్రం అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ చిత్రానికి సీక్వెల్ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న తాజా  సినిమా రోబో 2.0.

బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ప్రతినాయక పాత్రలో నటిస్తుండటం, ఇటీవల రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి  మంచి రెస్పాన్స్ రావటంతో సినిమాకి హైప్ క్రియేట్ అయ్యింది. ఆ హైప్ ను మరింత పెంచడానికి సినిమా టీజర్ ని విడుదల చేయనుంది చిత్రయూనిట్. ఏప్రిల్ 14న ఈ టీజర్ రిలీజ్ కు కావాల్సిన ఏర్పాట్లను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడట శంకర్.    తమళ సంవత్సరాది కానుకగా విడుదల కానున్న ఈ టీజర్..  సినిమాకి ఇంకెంత హైప్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Leave a Reply