Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సూపర్ స్టార్ రజని కాంత్ మరోసారి అభిమానుల్ని నిరాశపరిచాడు.రాజకీయ రంగ ప్రవేశం గురించి ఏదో ఒకటి చెప్తాడని ఆశించి తమిళనాడు లోని అన్ని వైపుల నుంచి తరలివచ్చిన అభిమానుల ఆశల మీద నీళ్లు చల్లాడు రజని.రాజకీయాల విషయంలో నిజంగా ఆ దేవుడు చెప్పినట్టు నడుచుకుంటానని ఓ పాత చింతకాయ లాంటి డైలాగు తో సరిపెట్టాడు రజని.పైగా తన పేరుని రాజకీయాల కోసం వాడుకుంటున్నారని చెప్పి రజని వాపోయాడు.నిజానికి రజని గడిచిన పదిపదిహేనుళ్లుగా చెప్తున్న దానికి భిన్నంగా ఇప్పుడేమీ చెప్పలేదు.అభిమానులతో మీటింగ్ అని రజని చెప్పడంతో అంతా ఏదేదో ఊహించుకుని వచ్చారు.కానీ ఏ స్పెషాలిటీ లేకుండానే సమావేశం రజని పడికట్టు మాటలు,ప్రసంగంతో ముగిసిపోయింది.
రజని మరోసారి తన అభిమానుల్ని దేవుడు ఆదేశం లాంటి మాటలతో బోల్తా కొట్టించి ఉండొచ్చు .జనం మాత్రం ఆయన్ని రాజకీయాల విషయంలో లైట్ తీసుకుంటున్నారు.ఇక ఆయన దేవుడు పేరు చెప్పి రాజకీయాల మీద నిర్ణయం ప్రకటించకుండా తప్పించుకోవడం మాత్రం ఏమీ బాగా లేదు.పైగా ఆ టైం రావాలి అనుకుంటూ ఎదురు చూసేందుకు రజని ఏమీ నవ యువకుడు కాదు.ఆయన వయసు 66 ఏళ్ళు .ఓ విధంగా చెప్పాలంటే సగటు భారతీయుడు వృత్తి నుంచే గాక యాక్టివ్ లైఫ్ నుంచి విత్ డ్రా అయ్యే వయసు.ఆ వయసులో కూడా ఇంకా అటు ఇటు గాకుండా మాట్లాడటం పరిణితి అనిపించుకోదు.అది నిర్ణయాలు తీసుకోలేని అసమత్థతే అవుతుంది.కనీసం రాజకీయాలకు తాను సరిపోనని ప్రకటించినా కొంతలో కొంత నయం. ఏదీ కాకుండా ఇలా దాగుడు మూతలు ఆడడం రజని విలువని తగ్గించేవే.వ్యక్తి ప్రవర్తన వయసుకు తగినట్టు ఉంటేనే అది గౌరవ ప్రదం.