అమీర్ కోరికను కాదన్న కబాలి..!

0
251
Rajinikanth Shock To Aamir Khan Dangal Movie

Posted [relativedate]

Rajinikanth Shock To Aamir Khan Dangal Movieబాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ కోరికను సౌత్ సూపర్ స్టార్ రజినికాంత్ కాదనడం ఇప్పుడు హాట్ టాపిక్ గా నిలిచింది. అమీర్ ఖాన్ లీడ్ రోల్ లో నటించిన సినిమా దంగల్.. ఇప్పటికే ట్రైలర్ తో దుమ్మురేపుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తమిళ నాట సినిమాకు రజిని వాయిస్ యాడ్ చేస్తే మంచిదని రజినికాంత్ కు స్వయంగా అమీర్ ఖాన్ ఫోన్ చేసి అడిగారట.

అమీర్ కోరికను సున్నితంగా తిరస్కరించాడట తలైవా. కారణాలు ఏవైనా సరే అమీర్ ఖాన్ కోరికను కాదన్న రజిని అదే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ను తన రోబో సీక్వల్ లో విలన్ గా పెట్టుకున్నాడు. మరి కేవలం తను ఏ సినిమాను ప్రమోట్ చేయకూడదు అన్న కారణంతోనే రజిని అమీర్ సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వనన్నాడా లేక వేరే ఏదైనా కారణం ఉందో తెలియట్లేదు. రీసెంట్ గా 2.0 ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ లో కూడా సల్మాన్ ఖాన్ వచ్చాడు కాని అమీర్, షారుఖ్ ఖాన్ లాంటి వారు రాలేదు. అయితే వారికి ఇన్విటేషన్ పంపించారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

డిసెంబర్ 23న రిలీజ్ అవుతున్న దంగల్ మూవీ తెలుగు, తమిళంలో భారీగానే రిలీజ్ అవుతుంది. ఇక అదే రోజు సూర్య సింగం సీరీస్ లో మూడో భాగంగా వస్తున్న ఎస్-3 కూడా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

Leave a Reply