డ్రైవర్లకు జీతాలు ఇవ్వలేకపోతున్న రజినీకాంత్ భార్య!!

128

Posted [relativedate]

rajinikanth wife salary late to drivers
సూపర్ స్టార్ రజినీకాంత్ భార్య లత ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నారు. అప్పట్లో కొచ్చాడయాన్ చిత్రానికి సంబంధించి ఆమె ఓ వివాదంలో ఇరుక్కున్నారు. తాజాగా డ్రైవర్లకు జీతాలివ్వడం లేదని ఆమెపై ఆరోపణలొచ్చాయి.

లత రజినీకాంత్ ఆధ్వర్యంలో ఓ ఆశ్రమం నడుస్తోంది. ఇందులో 28 డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. వారికిప్రతినెలా 25 నుంచి 29 తేదీల మధ్య జీతం వచ్చేదట. కానీ ఆరు నెలలుగా చాలా ఆలస్యం జరుగుతోందని సమాచారం. దీనిపై ఆమెకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా లతా రజినీకాంత్ పట్టించుకోట్లేదట. దీంతో సహనం నశించిన ఆ డ్రైవర్లంతా ఆశ్రమంలో ఆందోళనకు దిగారని చెబుతున్నారు.

డ్రైవర్ల ఆందోళనతో విషయం మీడియా దాకా వెళ్లింది. దీంతో ఆశ్రమ యాజమాన్యం కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తోందట. పెద్ద నోట్ల రద్దు వల్లే ఇలా జరిగిందని చెప్పుకొచ్చారని టాక్. కానీ ఇందులో వాస్తవం లేదంటున్నారు డ్రైవర్లు.పెద్ద నోట్ల రద్దు జరిగి నెలన్నరే అయ్యింది. కానీ జీతాలు మాత్రం 6 నెలలుగా ఆలస్యం చేస్తున్నారని చెబుతున్నారట. మొత్తానికి ఈ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. అయినా లతా రజినీకాంత్ ఇలా చేయడం వల్ల.. తలైవా ఇమేజ్ కు డ్యామేజ్ అవుతోందని వాపోతున్నారు ఆయన అభిమానులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here