ఆ చేతుల్లో రాళ్లు కాదు కలాలుండాలి ..రాజ్ నాధ్

 rajnath singh meet kashmir cm mahabooba mufti కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో జమ్ముకశ్మీర్‌లో రెండో రోజు ప‌ర్య‌టిస్తున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆయ‌న ఈరోజు ఆ రాష్ట్ర‌ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీతో స‌మావేశం నిర్వ‌హించారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ…కాశ్మీర్ లోయలో శాంతిని నెలకొల్పడానికి తాము ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీతో పాటు ఆయన తో మాట్లాడారు. కాశ్మీర్లోని అన్ని రాజకీయ పార్టీలు, ఇతర సంస్థల ప్రతినిధులతోనూ తాను చర్చించినట్టుచెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై అందరి సలహాలు కోరినట్టు తెలిపారు. సమస్య పరిష్కారం కోసం చర్చలకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

భారత్ భవిష్యత్తు కశ్మీర్‌తో ముడిపడి ఉందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. కశ్మీర్ లో శాంతియుత వాతావరణం కోసం కృషి చేస్తున్నామ‌ని తెలిపారు. క‌శ్మీర్ అల్ల‌ర్ల కార‌కులైన వారి కోసం అన్వేష‌ణ కొన‌సాగుతోందని పేర్కొన్నారు. యువతను తప్పుదోవ పట్టిస్తోన్న వారిని వ‌దిలిపెట్ట‌బోమ‌ని అన్నారు. యువ‌త చేతిలో ఉండాల్సింది రాళ్లు, మార‌ణాయుధాలు కాద‌ని.. క‌లాలు, కంప్యూట‌ర్లు, పుస్త‌కాలు ఉండాల‌ని ఆయ‌న అన్నారు.

త్వరలోనే అఖిల పక్ష నేతల బృందం కశ్మీరులో పర్యటిస్తుందన్నారు. ఇప్పటి వరకు 20 ప్రతినిధి బృందాలతో తాను చర్చలు జరిపానని తెలిపారు. 300 మందిని కలిశానన్నారు. దేశ భవిష్యత్తు కశ్మీరుతో ముడిపడి ఉందన్నారు. సంయమనం పాటించాలని భద్రతా దళాలకు సూచించినట్లు తెలిపారు. పెల్లెట్ గన్స్‌కు ప్రత్యామ్నాయాన్ని ఆలోచిస్తున్నామన్నారు. పెల్లెట్లను పరిమిత స్థాయిలో ఉపయోగించాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు.

SHARE