పీవోకేలో భారత్ ఆకస్మిక దాడుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫోన్లు చేసి అప్రమత్తం చేశారు. హైదరాబాద్లోని రక్షణ సంస్థలు, విశాఖలోని నేవీ, గుంటూరు జిల్లా బాపట్లలోని ఎయిర్ఫోర్స్బేస్ను అప్రమత్తం చేయాలని ముఖ్యమంత్రులకు ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా ఇస్రోలో భద్రతను కట్టదిట్టం చేయాలని కేంద్రం సూచించింది. మెట్రోనగరాల్లో తనిఖీలు ముమ్మరం చేయాలని, అనుమానితులను వెంటనే కస్టడీలోకి తీసుకుని విచారించాలని పోలీస్ కమిషనర్లను ఆదేశించింది. దేశంలో తాజా పరిస్థితుల దృష్ట్యా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికే పోలీసులకు పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది.