Posted [relativedate]
నోట్ల రద్దు నిర్ణయం జాతి ప్రయోజనాలను ఉద్దేశించి తీసుకున్నదేనని హోం మంత్రి రాజ్నాథ్ అంటున్నారు . సోమవారం లోక్సభలో విపక్షాల ఆందోళనల మధ్య రాజ్నాథ్ నోట్లరద్దు నిర్ణయంపై ప్రభుత్వ ఉద్దేశాన్ని సభకు తెలిపారు. నోట్ల రద్దు అంశంపై విపక్షాలు చర్చను ప్రారంభించాలని. చర్చకు ప్రభుత్వం పూర్తి సిద్ధంగా ఉందని , నోట్ల రద్దు అమలుకు సంబంధించి విపక్షాలు సూచనలు ఇచ్చినట్లయితే వాటిని కూడా చేర్చేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తామని కూడా చెప్పారు
నోట్ల రద్దు నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశాన్ని ప్రతిపక్షాలు ఎన్నడూ అనుమానించలేదని, అందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని రాజ్నాథ్ అన్నారు. కాగా, నోట్ రద్దు అంశంపై రాజ్యసభలో సోమవారం కూడా ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. ‘ప్రజల సొమ్ము ప్రజలకు ఇవ్వండి’ అంటూ విపక్ష సభ్యులు నిరసనలతో సభను హోరెత్తించారు.