రాజ్యసభకు జీ ఎస్టీ బిల్లు…?

0
549

rajyasabha gst bill

వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) బిల్లు ఈ వారంలోనే రాజ్యసభ ముందుకు రానుంది. 2015, మే జీఎస్‌టీ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. 122వ రాజ్యాంగ సవరణ బిల్లుగా ఇది ఇప్పటికే లోక్‌సభ ఆమోదం పొందిందని, రాజ్యసభ ఎంపిక కమిటీ కూడా తన నివేదికను అందించిందని ఆయన చెప్పారు. జీఎస్‌టీ బిల్లుపై మంగళవారం రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో అరుణ్‌ జైట్లీ సమావేశం నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా రాష్ట్రాల నుంచి వచ్చే అభ్యంతరాలను కేంద్రం ఏమేరకు పరిగణనలోకి తీసుకుంటుంది. పారిశ్రామిక ఉత్పత్తులు అధికంగా ఉండే తమిళనాడు, గుజరాత్‌ వంటి రాష్ట్రాల నుంచి ఇప్పటికే ఈ బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తమ య్యాయి. తమ ఉత్పత్తులపై ఇరత రాష్రాల నుంచి ఒక శాతం అదనపు పన్ను పొందే హక్కు తమకు ఉండాలని రాష్ట్రాలు వాదిస్తున్నాయి. మరోవైపు రాజ్యసభలో సంఖ్యా బలమున్న కాంగ్రెస్‌ నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నట్టు తెలుస్తున్నది. కాంగ్రెస్‌ను ఒప్పించేం దుకు ఇప్పటికే ఆ పార్టీకి చెందిన సీనియర్‌ నేతలతో అరుణ్‌ జైట్లీసహా పలువురు కేంద్ర మంత్రులు మంతనాలు జరిపారు.

సగం రాష్ట్రాల ఆమోదముంటేనే చట్టం మరో వైపు జీఎస్‌టీ గరిష్ఠంగా 22 శాతంగా ఉంటుందని బీజేపీ ప్రతిపాదించగా, దాన్ని 18 శాతానికే పరిమితం చేయా లని కాంగ్రెస్‌ పట్టుపడుతున్నట్టు సమాచారం. ఓవేళ కాంగ్రెస్‌ను ఒప్పించడంలో బీజేపీ సఫలమైతే ఈ బిల్లుకు రాజ్యసభలో అడ్డంకి తొలగిపోయినట్టే. ఈ బిల్లుపై రాజ్యసభలో ఐదు గంటల చర్చకు బీఏసీ అంగీకరించిందని పార్లమెంటరీ వ్యవహారా లశాఖమంత్రి అనంత్‌కుమార్‌ తెలిపారు. 247మంది సభ్యులుండే రాజ్యసభలో కాంగ్రెస్‌కు 60మంది, బీజేపీకి 53మంది ఎంపీల బలమున్నది. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 12న ముగియనున్నాయి. అయితే, జీఎస్‌టీ బిల్లు రాష్ట్రాల హక్కులతో ముడిపడి ఉన్నందున కనీసం సగం అసెంబ్లీల ఆమోదం పొందితేనే అది చట్టరూపం దాల్చనున్నది.

Leave a Reply