Posted [relativedate]
తెలుగు సినిమా స్టామినాను ప్రపంచానికి చాటిచెప్పిన సినిమా బాహుబలి. బాహుబలి బిగినింగ్ చివర్లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చెప్పాడో పెద్ద ట్విస్ట్ పెట్టాడు డైరెక్టర్ రాజమౌళి. ఆ సినిమా క్లైమాక్స్ లో పెట్టిన ట్విస్ట్ పై ఇప్పటికీ అందరూ చర్చించుకుంటూనే ఉంటారు. బాలీవుడ్ లో సైతం కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడోనంటూ జోకులు సర్క్యులేట్ అవుతున్నాయి.
బాహుబలి-2 లో కట్టప్ప సీక్రెట్ ను రివీల్ చేయబోతున్నాడు రాజమౌళి. అయితే ఈ సీక్రెట్ ఏంటో రాజమౌళి, ఆ సినిమాలోని నటీనటులకు తప్ప ఎవరికీ తెలియదు. కానీ అలాంటి సీక్రెట్ తనకు తెలుసంటూ చెప్పుకొచ్చారు కేంద్రమంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్. గోవాలో ఇటీవల జరిగిన 47వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఆయనకు ఎలా తెలుసనేది ఇప్పుడు హాట్ టాపిక్.
కేంద్రమంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ కు కట్టప్ప సీక్రెట్ ను చెప్పిందెవరో తెలిస్తే షాక్ అయిపోతారు. అది మరెవరో కాదు. స్వయంగా డైరెక్టర్ రాజమౌళియే. జక్కన్నే .. రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ తో ఈ సీక్రెట్ ను చెప్పేశారట. ఈ విషయాన్ని రాథోడ్ ఫిలిం ఫెస్టివల్ వేదికగా ప్రకటించారు. అంతా బాగానే ఉంది కానీ… అసలు రహస్యాన్ని ఆయన కూడా బయటకు చెప్పలేదు. సీక్రెట్ తెలుసన్నారు తప్ప ఆ సీక్రెట్ ను ఏంటో బయటపెట్టలేదు.