మోడీ ఎవరికీ డ్రీం మాన్..

  rakhi sawant  modi dress

ప్రధాని నరేంద్ర మోదీ చిత్రాలతో ఉన్న డ్రెస్ ధరించి విమర్శలు ఎదుర్కొంటున్న రాఖీ సావంత్.. తానేమీ తప్పుచేయలేదని అందంటోంది. మోదీజీపై అభిమానంతోనే ఇలా చేశానని వివరణ ఇచ్చింది. మోదీ ఫొటోలతో ఉన్న స్కర్ట్ ధరించి చికాగోలో ఇటీవల జరిగిన ప్రీ ఇండిపెండెన్స్ వేడుకల్లో రాఖీ పాల్గొంది. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి.

విమర్శలపై తనదైన శైలిలో స్పందించింది రాఖీ. బీజేపీని ఆకట్టుకోవాలనే ఈ డ్రెస్ ధరించాను అని చెప్పింది. ముఖ్యంగా మోదీ, అమిత్ షా దృష్టిలో పడాలని ఇలా చేసిందట. ఇక మోదీ నా డ్రీమ్ మ్యాన్ అని కూడా ప్రకటించింది. ఆయన మన ప్రధానమంత్రి కావడం నాకు ఆనందం కలిగించింది. మరో 15 ఏళ్లు ఆయన ప్రధానిగా ఉంటారు. ఎక్కడికి వెళ్లినా ఈ డ్రెస్ వేసుకుంటాను. మోదీ ఫొటోలతో చీర కూడా డిజైన్ చేయించుకుంటానని చెప్పింది రాఖీ.

SHARE