మూడేళ్లకే అమ్మడు అందుకోలేని రేంజ్..!

Posted November 30, 2016, 10:38 am

Image result for rakul preet singh

ప్రస్తుతం టాలీవుడ్ జపిస్తున్న హీరోయిన్ పేరు రకుల్ ప్రీత్ సింగ్.. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ త్వరలోనే స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు కొట్టేసింది. టాలీవుడ్ హాట్ ఫేవరేట్ హీరోయిన్ అయిన రకుల్ మంగళవారం నాటికి మూడేళ్ల కెరియర్ ను పూర్తి చేసుకుంది. వచ్చి మూడేళ్లే అయినా అందుకోలేని రేంజ్ కు ఎదిగింది ఈ అమ్మడు. ముందు కుర్ర హీరోలతో కెరియర్ ప్రారంభించినా స్టార్స్ సినిమాలో అవకాశాలను అందిపుచ్చుకుని ఇప్పుడు స్టార్ హీరోలకు పర్ఫెక్ట్ హీరోయిన్ అనిపించుకుంటుంది.

ఇక తన సక్సెస్ ఫుల్ త్రీ ఇయర్స్ కెరియర్ కంప్లీట్ చేసుకున్న సందర్భంలో రకుల్ తన ఫ్యాన్స్ అందరికి థాంక్స్ చెప్పింది. ట్విట్టర్ ద్వారా తనను అభిమానిస్తున్న ఆదరిస్తున్న అభిమానులకు స్పెషల్ థాంక్స్ చెప్పింది రకుల్. ఇక సినిమా విషయానికొస్తే త్వరలోనే రాం చరణ్ ధ్రువతో ప్రేక్షకుల ముందుకు రానుండగా.. మహేష్ మురుగదాస్ మూవీలో రకుల్ నటిస్తుంది. అంతేనా సాయి ధరం తేజ్ విన్నర్ లోనూ ఆమె హీరోయిన్. ఇక బోయపాటి బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలో.. నాగ చైతన్య, కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్లో సినిమాకు రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది. కెరియర్ ప్రారంభించి మూడు సంవత్సరాలే అయినా దాదాపు పది సంవత్సరాల దాకా వెంట వచ్చే క్రేజ్ ఏర్పరచుకుంది ఈ చిన్నది. మరి ఇలానే అమ్మడు తెలుగు ప్రేక్షకులను అలరించాలని ఆశిద్దాం.