గాలికి ఆ హీరోయిన్ల తో సర్దుకుంటారా?

Posted November 12, 2016

rakul preet singh and priyamani dance show in gali janardhan reddy daughter marriage
గాలి జనార్దన్ రెడ్డి ఇంటి పెళ్లి లో బాలీవుడ్ టాప్ స్టార్స్ షారుఖ్,కత్రినా చిందేస్తారని వచ్చిన వార్తలు తేలిపోయినట్టే కనిపిస్తోంది.అందుకు వాళ్ళ డేట్స్ ఖాళీ లేవని వినిపిస్తోంది.కానీ రెమ్మ్యూనరేషన్ విషయంలో కుదరలేదని కొందరు ….500 , 1000 నోట్ల రద్దు ప్రభావముందని మరికొందరు చెబుతున్నారు.ఆ బాలీవుడ్ స్టార్స్ గాలి ఇంటికి రావడం లేదన్నది మాత్రం డిసైడ్ అయ్యింది.

ఇప్పుడు ఆ ప్లేస్ లో గాలి ఇంటిలో చిందేసేందుకు ఇద్దరు హీరోయిన్ల పేరు వినిపిస్తోంది.అందులో ఒకరు ప్రియమణి అయితే …ఇంకొకరు రకుల్ ప్రీత్ సింగ్.ఈ ఇద్దరితో గాలి ఇంటిలో నృత్య కార్యక్రమం ఉండొచ్చని తెలుస్తోంది.మొత్తానికి కారణమేదైనా ఈ హీరోయిన్లతో గాలి సర్దుకోవాల్సివస్తుంది.

SHARE