పల్లెటూరి అమ్మాయిగా రకుల్..

Posted March 20, 2017

rakul preet singh as village girl in naga chaitanya movieవెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో టాలీవుడ్ కి దగ్గరైన రకుల్ ప్రీత్ సింగ్ అతి తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ గా చోటు దక్కించుకుంది. ప్రస్తుతం మహేష్ బాబు సినిమాతో పాటు  నాగచైతన్య సినిమాలో కూడా నటిస్తోంది.  కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్న చైతూ సినిమాలో రకుల్ ఇదివరకు ఎన్నడూ కనిపించని విధంగా దర్శనమివ్వనుందట.  ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ, రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీగా సాగనున్న ఈ సినిమాలో రకుల్ ఓ పల్లెటూరి అమ్మాయిగా నటిస్తోందని చిత్రయూనిట్ చెబుతోంది.

అన్నపూర్ణ స్యుడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మిస్తున్న ఈ సినిమాకు రారండోయ్ వేడుక చూద్దాం అనే టైటిల్ ని ఫిక్స్ చేశారని తెలుస్తోంది. ఇప్పటివరకు గ్లామర్ పాత్రల్లో  మెరిసిన రకుల్ మరి పల్లెటూరి అమ్మాయిగా ఎలా మెప్పిస్తుందో చూడాలి.

SHARE