రకుల్ కి గాయాలు.. ఆసుపత్రిలో చేరిక

 Posted October 21, 2016

rakul preet singh got accident mahesh murugadoss movieటాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ షూటింగ్ లో గాయపడింది. ఆమెని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు సమాచారమ్. వివరాల్లోకి వెళితే.. మహేష్ బాబు-మురగదాస్ కలయికలో తెరకెక్కుతోన్న చిత్రంలో నటిస్తోంది రకుల్. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. కొన్నాళ్లుగా ఓ భారీ యాక్షన్ సీన్ ని తెరకెక్కిస్తున్నారు. సినిమాలో ఈ యాక్షన్ సీన్ హైలెట్ గా నిలువనుందట. ఈ ఒక్క సీన్ కోసమే దాదాపు రూ. 6కోట్లు ఖర్చు పెడుతోంది చిత్రబృందం.

ఈ యాక్షన్ సీన్ చిత్రీకరణలో మహేష్ బాబుతో కలసి రకుల్ ప్రీత్ సింగ్ కూడా పాల్గొంది. ఆ ఫైట్‌ సీన్స్‌లో భాగంగా రకుల్‌కు స్వల్వ గాయాలయ్యాయని, చిత్ర యూనిట్‌ వెంటనే ఆమెను దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లిందని సమాచారమ్. అయితే, ‘తనకు పెద్ద గాయాలేమీ తగల్లేదని. చేతి వేలికి చిన్న గాయమైందని.. ఆమ్ సేఫ్ అంటూ ట్విట్ చేసింది’ రకుల్.

మహేష్ సినిమాతో పాటుగా, రాంచరణ్ ;ధృవ’, సాయి ధరమ్ తేజ్ ‘విన్నర్’ చిత్రాల్లోనూ కథానాయికగా నటిస్తోంది రకుల్.ఇక, మహేష్ -మురగదాస్ సినిమా ఫస్ట్ లుక్ ఈ దీపావళి, చిత్రం వచ్చే యేడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Hey guys ! My finger is not fractured, it’s a sprain. Should be fine soon. Thanku for all d messages n wishes

SHARE