వెరీ అప్సెట్ రకుల్..!

Posted November 25, 2016

rakul upset for media rumours tollywoodక్రేజీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ వెరీ అప్సెట్ లో ఉన్నదట. అరె ఎందుకు టాలీవుడ్లో సూపర్ ఫాంలో ఉన్న అమ్మడు ఎందుకు దిగులు పడుతుంది అంటే. కెరియర్ ఎంత సాటిస్ఫైడ్ గా ఉందో తన మీద వస్తున్న రూమర్స్ కూడా అదే రేంజ్లో ఉన్నాయని అమ్మడు ఫీల్ అవుతుంది. ఎప్పటినుండో రెమ్యునరేషన్ విషయంలో మీడియా హడావిడి చేస్తున్నా పట్టించుకోని రకుల్ ఈమధ్య గాలి జనార్ధన్ ఇంట్లో డ్యాన్స్ వేసేసరికి అమ్మడు దానికి కూడా భారీ పారితోషికం తీసుకుందని చాటింపేసింది. అంతేనా ఐటి అధికారులు ఆమెకు నోటీసులు పంపించారని రాస్తున్నారు.

ఈ న్యూస్ అన్ని రకుల్ వినేసి చాలా అప్సెట్ అవుతుందట. తను ఎంత మీడియా ఫ్రెండ్లీగా ఉన్నా కూడా ఇలాంటి న్యూస్ రాస్తున్నారని వాపోతుంది. ఇక ఈ విషయాల పట్ల తన తండ్రి కూడా బాధపడుతున్నాడన్న విషయం చెప్పింది రకుల్. అయితే క్రేజ్ ఉన్న భామలకు ఏదో ఒక విధంగా ఇలాంటి రూమర్స్ రావడం సహజమే అలాంటి వాటిని పట్టించుకోకుండా వెళ్లిపోవాలి అంతేకాని వాటి గురించి అప్సెట్ అవుతూ కూర్చో కూడదు.

ఎంట్రీ ఇచ్చిన కొద్దిరోజులకే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన రకుల్ మీడియా చేస్తున్న నెగటివ్ ప్రచారానికి కాస్త ఇబ్బంది పడుతున్నట్టు కనిపిస్తుంది. మరి ఈ విషయం పట్ల తను తర్వాత ఎలాంటి స్టెప్ తీసుకుంటుందో చూడాలి.

SHARE