Posted [relativedate]
మెగా పవర్ స్టార్ రాం చరణ్ నటించిన ధ్రువ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఈరోజు ఓవర్సీస్ లో ప్రీమియర్స్ పడనున్నాయి. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ధ్రువ సెట్స్ లో భయపడిన సందర్భాన్ని అందరితో షేర్ చేసుకున్నాడు చరణ్. చెర్రి భయపడటమా ఎందుకలా అంటే తమిళ సూపర్ హిట్ సినిమా రీమేక్ గా వస్తున్న ధ్రువ అక్కడ విలన్ గా నటించిన అరవింద్ స్వామినే ఇక్కడ విలన్ గా తీసుకున్నారు. అయితే సీనియర్ హీరో పవర్ఫుల్ యాక్టర్ అయిన అరవింద్ స్వామితో నటించాలా అని కాస్త భయమేసింది.
కాని ఆయన సహకారంతో వెంటనే ఆయనకు క్లోజ్ అవ్వగలిగా ఆన్ స్క్రీన్ పై తమ కాంబినేషన్ సూపర్ అనేలా ఉంటుందని చెప్పుకొచ్చాడు చరణ్. రోజా, బొంబాయి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన అరవింద్ స్వామి చెర్రి ధ్రువలో విలన్ గా రాబోతున్నాడు. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. బ్రూస్ లీ ఫ్లాప్ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ప్రేక్షకులకు నచ్చేలా చాలా జాగ్రత్తలు తీసుకున్నారట. మాత్రుక సినిమా కన్నా తెలుగు సినిమాపై ఇంకాస్త ఎక్కువ వర్క్ చేయడం జరిగిందని అంటున్నారు.
మరి చరణ్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ధ్రువ తనకు ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి. ఈ సినిమాకు ఎప్పుడులేని విధంగా ఓవర్సీస్ లో కూడా భారీ ప్రమోషన్స్ చేపట్టిన చెర్రి అక్కడ ప్రేక్షకులతోనే ప్రీమియర్స్ చూసేలా ప్లాన్ చేసుకున్నారు.