మెగా ఫ్యామిలీలో మెడికల్ ఎమర్జెన్సీ.. ఎవరికో తెలుసా ?

Posted October 15, 2016

  ram charan akhil participated humanity united againist terrar event americaమెగా ఫ్యామిలీలో మెడికల్ ఎమర్జెన్సీ కి నెలకొందా..?ఈ న్యూస్ స్వయంగా రాంచరణ్ నోట రావడంతో మెగా అభిమానులు కంగారు పడుతున్నారు. అసలు ఇంతకీ
ఏమైంది.. ? చెర్రీ ఏం చెప్పాడంటే.. ?? రేపు (అక్టోబర్ 15న) అమెరికాలోని న్యూ జెర్సీలో ”హ్యుమానిటీ యునైటెడ్ ఎగైనస్ట్ టెర్రర్” అనే ఈవెంటులో బాలీవుడ్, టాలీవుడ్ స్టార్స్ పాల్గొనాల్సి ఉంది. ఈ ఈవెంట్ లో రాంచరణ్ కూడా డ్యాన్స్ చేయనున్నాడు.

అయితే, ఆఖరి నిమిషంలో అమెరికాలో రిపబ్లిక్ హిందూ కొయాలిషన్ వారు తలపెట్టిన ఈ కాన్సర్టులో పాల్గొనడం కుదరట్లేదని చరణ్ తెలిపారు. అందుకు కారణంగా మెగా ఫ్యామిలీలో మెడికల్ ఎమర్జెన్సీ అవసరమైందని అందుకే ఆఖరి నిమిషంలో ఈ కాన్సర్ట్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తోందని సెలవిచ్చాడు. ఇప్పుడీ న్యూస్ మెగా అభిమానులని భయపెడుతోంది. మెగా ఫ్యామిలీలో ఎవరు అనారోగ్యానికి గురయ్యారని ఆరా తీస్తున్నారు.
  ram charan akhil participated humanity united againist terrar event america

ఇక, చెర్రీ వెళ్లలేకపోయినా..  రిపబ్లిక్ హిందూ కొయాలిషన్ వారు తలపెట్టిన ఈ కాన్సర్టులో అఖిల్, శ్రీయ,మనస్వి మంగాయ్.. పాల్గొననున్నారు. అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న రిపబ్లికన్ అభ్యర్ది డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నాడు.

SHARE