Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అంతా కొత్త వారితో ఒక సినిమా తెరకెక్కుతుంది అంటే అది ప్రేక్షకుల ముందుకు వచ్చే వరకు అనుమానమే. అసలు ఆ సినిమా విడుదలకు నోచుకుంటుందా, ఆ సినిమాను ప్రేక్షకులు ఆధరిస్తారా, ప్రేక్షకులకు ఆ సినిమా చేరుతుందా అనేది అనుమానం. చిన్న సినిమాల పబ్లిసిటీకి పెద్ద స్టార్స్ రావడం చాలా అరుదు. ఒక వేళ చిన్న సినిమాను పెద్ద స్టార్స్ ప్రమోట్ చేస్తే ఆ సినిమా స్థాయి పెరిగి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది. కాని ఎక్కువ శాతం చిన్న చిత్రాలు మంచి టాక్‌ను తెచ్చుకున్న పబ్లిసిటీ తెచ్చుకోక పోవడం కారణంగా చితికి పోతున్నాయి. అయితే కొన్ని చిన్న సినిమాలకు మంచి పబ్లిసిటీ దక్కినా కూడా అవి ఆకట్టుకోలేక పోతున్నాయి. తాజాగా అంతా కొత్తవారితో తెరకెక్కిన చిత్రం ‘కాదలి’. ఈ సినిమా గురించి ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. కాని ఇప్పుడు ఈ సినిమా గురించి అంతా మాట్లాడుకుంటున్నారు.
‘కాదలి’ సినిమా ఒక పాటను సమంత విడుదల చేయడంతో పాటు, సినిమా పోస్టర్‌ను రానా విడుదల చేయడం, ఆడియోను రామ్‌చరణ్, మంత్రి కేటీఆర్‌లు కలిసి ఆవిష్కరించబోతున్న నేపథ్యంలో సినిమాకు విపరీతమైన క్రేజ్ దక్కింది. నిన్న మొన్నటి వరకు ఎవరికి తెలియని కాదలి చిత్రం ఇప్పుడు ఒక్కసారిగా పెద్ద సినిమా ఎలా అయ్యిందని అంతా అవాక్కవుతున్నారు. సినిమా దర్శక నిర్మాత పట్టాభి ఆర్ చిలుకూరికి ఉన్న పరిచయాల కారణంగానే ఈ సినిమా ఈ స్థాయి పబ్లిసిటీని దక్కించుకుంటుంది. మంత్రి కేటీఆర్‌కు పట్టాభి చాలా ఆప్త మిత్రుడు, అలాగే చరణ్‌కు కూడా ఆయన సన్నిహితుడు. ఆ కారణంగానే ‘కాదలి’ సినిమాకు ఫుల్ పబ్లిసిటీ దక్కింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఒక ట్రై యాంగిల్ లవ్ స్టోరీ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుందో చూడాలి.