Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సుకుమార్ ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా ఒక సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. సుకుమార్ సినిమాలు అంటే హైఫైగా, ఎక్కువ విదేశాల్లో చిత్రీకరణ జరుపుకుంటూ ఉంటుంది. కాని ఈసారి సుకుమార్ చిత్రం మాత్రం పూర్తిగా గోదావరి జిల్లాల్లో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ సినిమాలో చరణ్ గెటప్ కూడా పూర్తి విభిన్నంగా ఉంది. ఒక పల్లెటూరు వ్యక్తిగా చరణ్ లుక్ కనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో చరణ్ పాత్ర ఏంటి, ఏం చేస్తాడు అనే ఆసక్తి అందరిలో వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఒక ఆసక్తికర విషయం ఒకటి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
గోదావరి జిల్లాల్లోని కొల్లెరు సెలఏరులో చేపలు పట్టుకునే చిట్టిబాబుగా రామ్ చరణ్ కనిపిస్తాడని ప్రచారం జరుగుతుంది. చరణ్ లుక్ ఇప్పటికే రివీల్ అయ్యింది. అయితే సినిమా అంతా కూడా చరణ్ ఇలాగే కనిపిస్తాడా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా ఉంది. సుకుమార్ ఏం చేసినా కూడా, ఒక విభిన్నమైన అంశంతో తెరకెక్కిస్తాడు. స్క్రీన్‌ప్లే ఈ సినిమాలో కూడా కాస్త విభిన్నంగా, హాలీవుడ్ సినిమాల రేంజ్‌లో ఉంటుందని అంటున్నారు. ఇక ఈ సినిమాకు ‘చిట్టిబాబు’ మరియు ‘రేపల్లె’ అనే టైటిల్స్‌ను పరిశీలిస్తున్నారు. సమంత హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అనసూయ ముఖ్య పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఇక జగపతిబాబు గ్రామ పెద్ద పాత్రలో కనిపించబోతున్నాడు. దసరా కానుకగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.