చెర్రికిది చాలా ప్రెస్టిజియస్..!

Image result for ram charan dhruva

మెగాస్టార్ వారసుడిగా మెగా పవర్ స్టార్ గా అవతరించిన రాం చరణ్ ఓవర్సీస్ మార్కెట్ పై తన పంజా విసిరేందుకు సిద్ధమయ్యాడు. కొద్దికాలంగా కెరియర్లో సరైన సక్సెస్ పడని చరణ్ ఈ గ్యాప్ లో తెలుగు హీరోల ఓవర్సీస్ మార్కెట్ పై ఏర్పరచుకున్న డిమాండ్ కు దూరమయ్యాడు. అందుకే ఈసారి ఎలాగైనా సరే ఓవర్సీస్ లో తన సత్తా చాటాలని చూస్తునాడు చెర్రి. ఈ క్రమంలో ఓవర్సీస్ లో కూడా ధ్రువ సినిమాను భారీగా రిలీజ్ చేస్తున్నారు.

కుర్ర హీరోలు కూడా ఓవర్సీస్ లో 1 మిలియన్ మార్క్ టచ్ చేస్తుంటే మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఒక్క సినిమా కూడా అక్కడ మిలియన్ మార్క్ క్రాస్ చేయలేదు.. అయితే ఈసారి అది కచ్చితంగా క్రాస్ అయ్యి తీరుతుందని అంటున్నారు. రిలీజ్ అయిన ధ్రువ టీజర్ ట్రైలర్ సినిమా మీద అంచనాలను పెంచేశాయి. ఓ విధంగా తని ఒరువన్ ఒరిజినల్ వర్షన్ కన్నా సురేందర్ రెడ్డి సినిమాను ఇంకా రిచ్ గా తీశాడని అనిపిస్తుంది. స్మాల్ మూవీస్ కూడా ఓవర్సీస్ మార్కెట్ మీద దృష్టి సారించాయి.

అందుకే ఈసారి ఓవర్సీస్ మీద ఎక్కువ కాన్సెంట్రేట్ చేస్తున్నాడు చరణ్. ఎలాగు అక్కడే ముందు ప్రీమియర్ షోస్ పడతాయి సినిమా టాక్ కూడా ముందు తెలిసేది అక్కడే అందుకే ఈసారి అక్కడ ఎక్కువ ప్రభావితం చూపి మిలియన్ మార్క్ దాటాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి అనుకున్నట్టుగా చెర్రి ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందా లేదా అన్నది చూడాలి.