Posted [relativedate]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.. కింగ్ నాగార్జునని బాగానే కన్వెన్స్ చేశాడు. ఏ విషయంలో అనుకుంటున్నారు కదూ. అక్కడికే వస్తున్నాం.
రామ్ చరణ్.. సుకుమార్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. పల్లెటూరి నేపధ్యంలో సాగే ఈ సినిమాలో చెర్రీ సరసన నటించేందుకు సమంతను సెలెక్ట్ చేసింది చిత్రయూనిట్. అయితే రీసెంట్ గా అఖిల్ పెళ్లి రద్దు అవ్వడంతో నాగార్జున.. చైతూ, సమ్మూల పెళ్లిని ముందే జరిపించడానికి నిర్ణయించాడు. దీంతో సమంత తన సినిమాలన్నీ క్యాన్సిల్ చేసుకుందని, ఈ క్రమంలో చెర్రీ సినిమా నుండి కూడా తప్పుకుందని వార్తలు వచ్చాయి. కానీ చెర్రీ చిత్రయూనిట్ మాత్రం తమ సినిమాలో సమంతే హీరోయిన్ అని తాజాగా ప్రకటించింది.
ఈ ప్రకటన వెనుక చాలా తతంగమే నడిచిందట. స్వయంగా చెర్రీనే… నాగార్జున, చైతన్యలను కన్వెన్స్ చేశాడని చెబుతున్నారు. కేవలం నాలుగు నెలల్లో పకడ్భందీ షెడ్యూల్స్ తో సినిమా పూర్తి చేస్తామని, సమంత కాల్షీట్ల మేరకు నటించి వెళ్లిపోతే చాలని వివరించాడట. సమంతకు సంబంధించిన సన్నివేశాల వరకు యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్ పూర్తి చేస్తామని చెర్రీ ప్రామిస్ చేశాడట. దీంతో నాగ్ కన్విన్స్ అయ్యాడట. సో.. చెర్రీ సినిమాలో నటించడానికి సమంత ముందుకొచ్చిందని అంటున్నారు.