దసరా కానుకగా ‘ధృవ’ టీజర్

Posted October 5, 2016

   ram charan dhruva movie teaser release dasara

మెగా అభిమానులకి గుడ్ న్యూస్. మెగా ‘ఖైదీ’ సీరియస్ గా ఫైట్స్ చేస్తున్నాడు. యాక్షన్ ఏపీసోడ్స్ తో మెగాస్టార్ బిజీ అయిపోయాడు. ‘కాటమరాయుడు’ హడావుడి ఇంకా మొదలుకాలేదు. డీజె.. ఇంకా ఎలాంటి దుకాణం తెరవలేదు. ఈ నేపథ్యంలో మెగా అభిమానులు ‘ధృవ’ని నమ్ముకొన్నారు. దసరా  సంబురాలు ‘ధృవ’ థియేటర్ లో జరుపుకోవాలని మెగా అభిమానులు ఆశపడ్డారు. అయితే, ధృవ రిలీజ్ డిసెంబర్ కి వెళ్లడంతో.. మెగా అభిమానుల్లో నిరాశ
మొదలైంది. ఈ సారి దసరా మెగా సందడి లేకుండానే ముగుస్తుందేమోనని భయపడ్డారు.

అయితే, దసరాకి ‘ధృవ’ సినిమాని తీసుకురాలేకపోతున్న చెర్రీ టీజర్ తో సందడి చేయాలని డిసైడ్ అయినట్టు సమాచారమ్. దసరా కనుకగ ధృవ టీజర్ రిలీజ్
చేయనున్నారు. ప్రస్తుతం టీజర్ కట్ తో చిత్రబృందం బిజీగా ఉండనున్నట్టు తెలుస్తోంది. రాంచరణ్ బాటలోనే మెగాస్టార్, పవర్ స్టార్, స్టయిలీష్ స్టార్ లు కూడా తమ తమ విశేషాలతో కూడిన ఏదో ఒకటి వదిలి మెగా ఫ్యాన్స్ ని ఖుషి చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారమ్. ఇదే నిజమయితే.. మెగా అభిమానులకి పండగే.

SHARE