చెర్రీ సినిమా కి బాహుబలి ప్రొడ్యూసర్?

0
736

  ram charan hero prabhas producer
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కొత్త సినిమాకి బాహుబలి ప్రభాస్ నిర్మాత కాబోతున్నాడా? ఫిలిం నగర్ లో వినిపిస్తున్న దాన్ని బట్టి ఈ వార్త నిజమే.యువీ క్రియేషన్స్ లో వచ్చే ఏడాది ఓ భారీ సినిమా చేసేందుకు మాటలు పూర్తి అయిపోయినట్టేనంట.మిర్చి ,రన్ రాజా రన్,ఎక్సప్రెస్ రాజా,భలే భలే మగాడివోయ్ చిత్రాలు తీసిన యువీ క్రియేషన్స్ వెనుక వుంది ప్రభాస్ అని అందరికీ తెలిసిన విషయమే .

ఇప్పటిదాకా ప్రభాస్ కాకుండా చిన్న హీరో లతో మాత్రమే సినిమాలు తీసిన యువీ మరో పెద్ద హీరోతో సినిమా ప్లాన్ చేయడం ఇదే మొదటిసారి.చెర్రీ హీరోగా చేసే ఫిలిం కి దర్శకులుగా ఇద్దరుముగ్గురు పేర్లు నలుగుతున్నాయి.వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ఫేమ్ మేర్లపాక గాంధీ ,జిల్ ఫేమ్ రాధాకృష్ణ సహా ఓ ప్రముఖ దర్శకుడు ఈ రేసులో ఉన్నట్టు తెలుస్తోంది.చెర్రీ ఎవరి కధకి ఓకే అంటే వారితో సినిమాకి యువీ క్రియేషన్స్ రెడీ అయిపోతుందంట.

Leave a Reply