రాజమండ్రిలో చరణ్ ..ఇక కొన్నాళ్ళు ఇక్కడే?

 Posted April 1, 2017

ram charan in rajahmundry for sukumar movie shooting
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇక కొన్నాళ్ల పాటు రాజమండ్రిలో ఉండబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో సుకుమార్ డైరెక్షన్ లో నటించే సినిమా కోసం చరణ్ రాజమండ్రిలో దిగారు.అక్కడికి దగ్గర్లోని పూడిపల్లిలో ఈ సినిమా మేజర్ పోర్షన్ షూటింగ్ జరగబోతోంది. 1980 కాలం నాటి ప్రేమకథ లో పల్లెటూరి యువకుడి పాత్ర చరణ్ చేయబోతున్నారు.ఇందుకోసం చరణ్ సరికొత్త గెట్ అప్ ట్రై చేస్తున్నాడు.గడ్డం పెంచి రఫ్ లుక్ లో కనిపించబోతున్నాడు.

ధ్రువ సినిమాకి ముందు వరస ప్లాప్ లతో సతమతమైన రామ్ చరణ్ కి మణిరత్నం ఓ మంచి సలహా ఇచ్చాడు. మరికొన్ని ప్లాప్ లు,ఇబ్బందులు ఎదురైనా సరికొత్త పాత్రలు ఎంచుకుంటే కెరీర్ బాగుంటుందని మణి సూచించాడు.ఆ సలహా ప్రకారం ఇంతకు ముందు ధ్రువ,ఇప్పుడు సుకుమార్ సినిమా ఒప్పుకున్నాడు చరణ్.ఈ సినిమాలో ఏ మాత్రం గ్లామర్ కి అవకాశం లేని పాత్రని పోషించబోతున్నాడు చరణ్.అందుకే సినిమా షూటింగ్ కి కొంత టైం వున్నా పాత్ర,వాతావరణానికి అలవాటు పడేందుకు కాస్త ముందుగానే చరణ్ రాజమండ్రిలో దిగిపోయారు.

SHARE