సుకుమార్ సినిమాలో చెర్రీ లుక్ ఇదేనా..?

Posted March 27, 2017

ram charan look in sukumar movieహీరోగా ధృవ సినిమాతో, నిర్మాతగా ఖైదీ నెం. 150తో రెండు విజయాలను ఒకేసారి అందకున్నాడు రామ్ చరణ్ తేజ్. ఈ  జోష్ తో ఓ వైపు  సుకుమార్ సినిమాలో నటించడానికి ఓకే చెప్పిన చెర్రీ   మరో వైపు చిరు 151వ మూవీని కూడా నిర్మిస్తున్నాడు. సుకుమార్ సినిమాలో చెర్రీ సరసన సమంత జతకట్టనుంది. పల్లెటూరి ప్రేమకధ బ్యాక్ డ్రాప్ తోసాగే ఈ సినిమాలో చెర్రీ అంధుడిగా, పల్లెటూరి వాడిగా  నటించనున్నాడని రకరకాల వార్తలు వచ్చాయి. అయితే ఈ రోజు చెర్రీ పుట్టినరోజు సందర్భంగా చిత్రయూనిట్ ఓ పోస్టర్ ని రిలీజ్ చేసింది.

ఈ పోస్టర్ లో చెర్రీ వైట్ షర్ట్ లో, గడ్డంతో దర్శనమిచ్చాడు. అటు మాసీ లుక్ తో కనిపిస్తూనే చాలా స్టైలిష్ గా ఉన్నాడు. ఫోర్ గ్రౌండ్ లో ఓ పల్లెటూరిని కూడా ఎస్టాబ్లిష్ చేశాడు సుకుమార్. కాగా సినిమా ప్రారంభోత్సవ  కార్యక్రమాలు ఎప్పుడో పూర్తైనప్పటికీ రెగ్యూలర్  షూటింగ్ మాత్రం జరగడం లేదు. ఏది ఏమైనప్పటికీ పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టోరీగా తెరకెక్కే  ఈ సినిమాలో   చెర్రీ రోల్ ఏంటో  సినిమా షూటింగ్ ప్రారంభమైతే కానీ బయటకు పొక్కదు. మరి సుకుమార్ సినిమాను ఎప్పుడు సెట్స్ పైకి తీసుకెళ్తాడో చూడాలి.

SHARE